సన్ రైజర్స్ జట్టులోకి కెప్టెన్ సహా కొత్త ఆటగాళ్లు వచ్చి చేరినా సరే ఫలితం మారలేదు. లక్నోతో జరిగిన రెండో మ్యాచులోనూ ఓడిపోయింది. వరసగా రెండు మ్యాచుల్లో ఓడినా సరే ఫ్యాన్స్ మాత్రం తెగ ఆనందంగా ఉన్నారు. దీనికి కారణమేంటో తెలుసా?
మీలో ఐపీఎల్ చూసేవాళ్లు ఎవరెవరు? బహుశా ఈ స్టోరీ చదువుతున్న వాళ్లలోనూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ జట్టుకు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటింది. వార్నర్, ధావన్, విలియమ్సన్.. హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు కొత్తగా తయారైన అభిమానులు.. ఇప్పటికీ అంతే లాయల్టీతో జట్టుని ప్రేమిస్తున్నారు. కానీ కప్పే అందని ద్రాక్షలా మారింది. ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే.. ఇప్పటివరకు ఆడింది రెండు మ్యాచులు. వీటిలో ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఓడిపోయింది. అయినా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్. ఆ ఒక్క విషయమే దీనికి కారణం. ఇంతకీ అదెంటో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సన్ రైజర్స్ పేరు చెప్పగానే అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది తెగ ఎగ్జైట్ అయిపోయేవారు. ఎందుకంటే వార్నర్, ధావన్, విలియమ్సన్, బెయిర్ స్టో లాంటి అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉండేవాళ్లు. వాళ్లంతా వేరే వేరే టీమ్స్ లోకి వెళ్లిపోయిన తర్వాత అభిమానులు కూడా చాలామంది మనసు మార్చేసుకున్నారు. అయినా సరే సన్ రైజర్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే.. హ్యారీ బ్రూక్, మార్క్రమ్, క్లాసన్ లాంటి యంగ్ ప్లేయర్స్ జట్టులోకి రావడంతో కప్ పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. కానీ తొలి రెండు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది.
రాజస్థాన్ తో తొలి మ్యాచులో 72 పరుగుల తేడాతో ఓటమిపాలైన సన్ రైజర్స్.. తాజాగా లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. ఇలా హోమ్ గ్రౌండ్ తోపాటు, బయట గ్రౌండ్ లోనూ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటోంది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 2016లోనూ ఇలానే తొలి రెండు మ్యాచుల్లో బెంగళూరు, కోల్ కతా జట్ల చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత చాలా మ్యాచుల్లో గెలిచి, ఫైనల్ గా కప్ కొట్టేసింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని.. లక్నోతో మ్యాచ్ ఓడిపోయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒకటే రచ్చ చేస్తున్నారు. మరి హైదరాబాద్.. ఈ సీజన్ లో కప్ కొడుతుందా? మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
Can Sunrisers Hyderabad repeat their heroics in 2016?🤔
📸: IPL/BCCI pic.twitter.com/CZBcDqvKx8
— CricTracker (@Cricketracker) April 7, 2023