ఐపీఎల్ సమరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రాజస్థాన్ బ్యాటర్లు ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తొలి ఓవర్లోనే తడబడింది.
ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోంగ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ లో మొత్తం ముగ్గురు టాపార్డర్లు బ్యాటర్లు అర్ధ శతకాలు నమోదు చేశారు. పవర్ ప్లేలో రాజస్థాన్ తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు నమోదు చేసింది. ప్రతి బౌలర్ ఎంతో ఎక్స్ పెన్సివ్ గా మారారు. ఒక్క నటరాజన్ మాత్రమే 7.7 ఎకానమీతో 3 ఓవర్లు బౌలింగ్ వేసి 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ భువనేశ్వర్ అయితే వికెట్ తీయకపోగా అందరికంటే ఎక్కువ పరుగులు కన్సీడ్ చేశాడు.
అయితే హైదరాబాద్ జట్టు బౌలర్స్ ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుంకంటే రాజస్థాన్ ఉన్న జోరులో కచ్చితంగా 250కి పైగా పరుగులు నమోదు చేసేలా కనిపించారు. కానీ, వారి జోరుకు కళ్లెం వేస్తూ హైదరాబాద్ బౌలర్లు నిలదొక్కుకున్నారు. బట్లర్(54), జైశ్వాల్(54), పడిక్కల్(2), రియాన్ పరాగ్(7), శాంసన్(55)లను వరుసగా పెవిలియన్ కి పంపి స్కోర్ బోర్డుకి కాస్త బ్రేకులు వేయగలిగారు. రాజస్థాన్ మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో బౌలర్లు అంత ఫామ్ లో కనిపించకపోయినా కూడా ఉమ్రాన్ మాలిక్ తీసిన వికెట్ మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Ladies and gentlemen, 𝐉𝐚𝐦𝐦𝐮 𝐄𝐱𝐩𝐫𝐞𝐬𝐬 Umran Malik is back in town 🚆
📸: Jio Cinema pic.twitter.com/yy6LEV2TrX
— CricTracker (@Cricketracker) April 2, 2023
ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్- దేవ్ దత్ పడిక్కల్ ని అవుట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ జమ్ము ఎక్స్ ప్రెస్ కుర్రాడు వేసిన బంతికి పడిక్కల్ వికెట్ ఎగిరి అవతల పడింది. 15వ ఓవర్ లో మొదటి బంతికి పడిక్కల్ ను ఉమ్రాన్ పెవిలియన్ చేర్చాడు. వికెట్ గాల్లోకి ఎగిరిన తర్వాత పడిక్కల్ ను చూస్తూ ఉమ్రాన్ మాలిక్ చొట్ట బుగ్గతో నవ్వులు చిందించడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇంక సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాటిని ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే డకౌట్లుగా పెవిలియన్ చేర్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
.@umran_malik_01 doing Umran Malik things! 👍
Relive how he picked his first wicket of the #TATAIPL 2023 👇#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF
— IndianPremierLeague (@IPL) April 2, 2023