సన్ రైజర్స్ పేరు చెప్పగానే రికార్డులు అయితే ఉండవనే అంటారు. అలాంటి ఈ జట్టు ఇప్పుడు చెన్నై లాంటి జట్టుకి సాధ్యం కానీ ఓ ఘనత సాధించింది. ఇంతకీ ఏంటి విషయం?
సన్ రైజర్స్ టీమ్ పై ఈసారి ఒక్కడంటే ఒక్కడికి కూడా ఆశల్లేవు. ఈ సీజన్ లో గెలవాలనే కసి అసలు లేదు అన్నట్లే ఆడుతూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు రాజస్థాన్ పై అదిరిపోయే రేంజులో గెలిచేసింది. చిన్న చిన్న టార్గెట్స్ ఫినిష్ చేయలేక చతికిలపడిపోతుంది అన్న మార్క్ ని కాస్త చెరిపేసుకుంది. ఏకంగా 200 ప్లస్ స్కోరుని ఛేదించింది. అసలు నమ్మశక్యం కాని రీతిలో అద్భుతం చేసింది. మ్యాచ్ గెలవడం గురించి కాసేపు పక్కనబెడితే.. పెద్దపెద్ద జట్లకే సాధ్యం కాని ఓ అరుదైన రికార్డుని SRH సృష్టించింది. ఏకంగా టాప్-3లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటా రికార్డు?
ఇక వివరాల్లోకి వెళ్తే SRH పేరు చెప్పగానే ఫ్యాన్స్ కి వార్నర్, విలియమ్సన్, బెయిర్ స్టో, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్స్ గుర్తొస్తారు. వీళ్లంతా ఉన్నప్పుడు జట్టు ఓ రేంజులో ఉండేది. చెన్నై, ముంబయి లాంటి టాప్ టీమ్స్ తో పోటీపడేది. కానీ రకరకాల కారణాల వల్ల ఈ క్రికెటర్లు అందరూ జట్టు నుంచి సైడ్ అయిపోయారు. అదిగో అప్పటినుంచి సన్ రైజర్స్ కి దురదృష్టం పట్టుకుంది. ఎప్పుడు ఎందుకు ఎలా ఆడుతోందో అస్సలు అర్థం కాదు. కోట్లు పెట్టి కొన్న బ్రూక్ లాంటి వాళ్లు కనీసం రన్స్ కొట్టకుండా జట్టు పరువు తీస్తున్నారు. భువనేశ్వర్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగపడట్లేదు.
ఈ సీజన్ లో అయితే సన్ రైజర్స్ దారుణమైన ప్రదర్శన చేస్తోంది. తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లో గెలవకపోతే ఇక ఇంటికెళ్లిపోవడం గ్యారంటీ అని అందరూ ఫిక్సయ్యారు. అలాంటిది రాజస్థాన్ నిర్దేశించిన 215 టార్గెట్ ని ఓవర్లన్నీ ఆడి, అదృష్టం కలిసి రావడంతో పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో మూడో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతకు ముందు 2020లో రాజస్థాన్ 224 రన్స్, 2021లో ముంబయి 219, 2008లో రాజస్థాన్ 215, 2023లో ముంబయి 215 పరుగుల్ని ఛేదించింది. ఇప్పుడు రాజస్థాన్ ని ఓడించిన సన్ రైజర్స్.. ఈ లిస్టులో మూడో స్థానానికి చేరుకుంది. సో అదన్నమాట విషయం. మరి హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో రికార్డ్ సృష్టించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
WHAT. A. GAME 😱😱
Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets.
Scorecard – https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz
— IndianPremierLeague (@IPL) May 7, 2023