Harry Brook: వేలంలో రూ.13.25 కోట్ల భారీ ధర పెట్టి కొంటే.. ఇతకి అది తక్కువేలే అనే మాట వినిపించింది. ఎందుకంటే అతను అలా ఆడుతున్నాడు. కానీ టీ20ల్లో కాదు. టెస్టుల్లో. టెస్టుల్లో ఆట వేరు, టీ20ల్లో ఆడటం వేరనే విషయం ఇప్పుడిప్పుడే సన్‌రైజర్స్‌కు బోధపడుతోంది.
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా..మిడిల్దార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను తీసుకోవడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టెస్టు క్రికెట్ ఆడేటోడ్నీ తీసుకొచ్చి.. ఎస్‌ఆర్‌హెచ్ నెత్తిన పెట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్‌పై 13 పరుగులు చేసి విఫలైమన బ్రూక్.. లక్నోపై దారుణంగా 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన వాడు.. ఇలా దారుణంగా విఫలం అవుతుండటంతో ఇందుకేనా రూ.13.25 కోట్లు పెట్టి కొన్నది అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే.. సన్‌రైజర్స్ మాత్రం బ్రూక్‌ను వేరే స్ట్రాటజీతో జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 6 అంతర్జాతీయ టెస్టులు ఆడిన బ్రూక్.. 80.90 భారీ యావరేజ్, 98.77 స్ట్రైక్ రేట్‌తో 809 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇది చూసి.. టెస్టుల్లోనే ఇలా ఆడుతున్నాడంటే ఇక టీ20ల్లో ఎలా చెలరేగిపోతాడో అనే ఆలోచనతో సన్‌రైజర్స్ భారీ ధర పెట్టి.. వేలంలో బ్రూక్‌ను సొంతం చేసుకుంది. అయితే.. బ్రూక్ టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్నా.. వన్డేలు, టీ20ల్లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు 3 వన్డేలు ఆడిన బ్రూక్ 28.66 యావరేజ్‌తో కేవలం 86 రన్స్‌చేశాడు. అలాగే ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడి.. 26.57 యావరేజ్‌తో 372 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఫార్మాట్లలో హ్యారీ బ్రూక్ అత్యంత తక్కువ యావరేజ్ టీ20ల్లో ఉంది. ఈ లెక్కలన్నీ పట్టించుకోకుండా.. టెస్టుల్లో బ్యాటింగ్ చూసి బ్రూక్ రూ.13.25 కోట్లు తగలబెట్టారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 13 పరుగులు చేసి బ్రూక్‌ను అభిమానులు వెనకేసుకొచ్చారు. ఫస్ట్ మ్యాచ్ కదా.. పర్వాలేదులే అని సర్దుకోపోయారు. కానీ.. రెండో మ్యాచ్‌లో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న టైమ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్.. బాధ్యతాయుతంగా ఆడి, జట్టును ఆదుకోవాల్సింది పోయి.. 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి.. స్టంప్ అవుట్ అయ్యాడు. జట్టు ఉన్న పరిస్థితులకు బ్రూక్ అవుటై తీరుకు ఏ మాత్రం పొంతన లేకపోయవడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణంగా నిలిస్తుంది. మంచి బంతులకు అవుటైనా అర్థం చేసుకోవచ్చు కానీ, ఇలా స్టంప్ అవుట్లు అయితే.. ఎలా అంటూ మండిపడుతున్నారు. మరి మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి.. ఆ 13 కోట్లకు న్యాయం చేస్తాడా? లేదా అంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harry Brook is the biggest Fraud in IPL History or there is someone else too? pic.twitter.com/7xKaqucyUo
— King Babar Azam Army (@babarazamking_) April 7, 2023