ఆర్సీబి ఫాస్ట్ బౌలర్ సిరాజ్ దూకుడు ఎలాంటిదో మనకి తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఈ దూకుడు అదుపు తప్పుతుంది. ఈ విషయంలో సిరాజ్ ఏం చేసాడంటే ?
ఐపీఎల్ లో భాగంగా నిన్న సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచులో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో సారి కోహ్లీ కెప్టెన్సీ చేపట్టడం విశేషం. ఈ విజయంతో ఆర్సీబి జట్టు 8 పాయింట్లతో 5 స్థానంలో నిలవగా.. ఓడినా రాజస్థాన్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో మహమ్మద్ సిరాజ్ చేసిన ఒక పని ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు. ఈ ఫాస్ట్ బౌలర్ చేసిన ఓవర్ యాక్షన్ కి అభిమానులు మండిపడుతున్నారు.
రాజస్థాన్ జట్టు గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు చేయాలి. ఈ దశలో 19 వ ఓవర్ కెప్టెన్ కోహ్లీ బంతిని సిరాజ్ కి ఇచ్చాడు. మొదటి నాలుగు బంతులు అద్భుతంగా వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ 5 వ బంతికి సిక్సర్ సమర్పించుకున్నాడు. ఇక చివరి బంతిని స్లో బాల్ గా వేసాడు. దీంతో భారీ షాట్ కి ప్రయత్నించినా బ్యాటర్ జురెల్ లాంగ్ ఆన్ వైపుకి ఆడాడు. ఫీల్డర్ లోమరోర్ వేగంగానే బంతిని సిరాజ్ చేతికి అందిచ్చినా.. సిరాజ్ తప్పిదం వలన ఆ రనౌట్ మిస్ అయింది.
మొదట సిరాజ్ కాలితో స్టంప్స్ ని తగలగా.. ఆ తర్వాత అవకాశమున్న మరో సారి బాల్ జారవిడిచి చేత్తో వికెట్లను కొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ ని సంప్రదించగా.. రీప్లేలో అది నాటౌట్ గా తేలింది. అయితే సిరాజ్ మాత్రం తప్పు ఫీల్డర్ దే అన్నట్లుగా అరిచేసాడు. సింపుల్ గా రనౌట్ చేసే అవకాశం సిరాజ్ వదిలేసి.. ఇలా బౌలర్ ని తప్పుపట్టడం ఏ మాత్రం బాగాలేదు. దూకుడు ఉండొచ్చు కానీ మరి తమ ఇంతలా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇక మ్యాచ్ అనంతరం సిరాజ్.. లోమరోర్ కి సారీ చెప్పాడు. బౌలింగ్ ఎంత బాగా వేసినంత మాత్రాన ఇలా సహచర ఆటగాళ్ల మీద కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
— IPLT20 Fan (@FanIplt20) April 23, 2023