నిన్న సాయంత్రం పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచులో చివరికీ పంజాబ్ నే విజయం వరించింది. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ థ్రిల్లింగ్ మ్యాచులకి కేరాఫ్ గా నిలుస్తుంది. ప్రారంభంలో కాస్త ఏకపక్షంగా ముగిసిన మ్యాచులు ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. నిన్న ఆదివారం కానుండడంతో అభిమానులకి ఐపీఎల్ డబుల్ కిక్ ఇచ్చింది. రెండు మ్యాచులు కూడా చివరి ఓవర్ వరకు వెళ్లాయి. ఇక నిన్న సాయంత్రం పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచులో చివరికీ పంజాబ్ నే విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన సందర్భంగా క్రికెటర్ సికందర్ రాజా భార్య ఎమోషనల్ అయింది.
పంజాబ్ ముందు 201 పరుగుల భారీ లక్ష్యం. బ్యాటర్ల విజ్రంబనతో చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. గ్రీజ్ లో జింబాబ్వే స్టార్ బ్యాటర్ సికందర్ రాజా, షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇంకేముంది పంజాబ్ విజయం ఖాయమనుకున్నారంతా. అయితే చెన్నై బౌలర్ పతిరానా తొలి 5 బంతులకి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచుని చెన్నై వైపుకి మళ్ళించాడు. ఇక చివరి బంతికి 3 పరుగులు కావాలి. ఈ దశలో ఓ వైపు కెప్టెన్ ధోని వ్యూహాలు, మరోవైపు పతిరానా పదునైన యార్కర్లు ముందు బౌండరీ రావడం దాదాపు అసాధ్యం అనుకున్నారు.
అనుకున్నట్లుగానే పతిరానా బౌండరీ ఇవ్వలేదు. కానీ చివరి బంతికి రాజా గ్యాప్ లో కొట్టి వేగంగా మూడు పరుగులు రాబట్టి పంజాబ్ కి థ్రిల్లింగ్ విక్టరీని అందించారు. దీంతో సికిందర్ రాజా మ్యాచ్ గెలిపించడంతో భార్య బాగా ఎమోషనల్ అయిపోయింది. అంత మంది ప్రేక్షకులున్న చెన్నై స్టేడియంలో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. తన భర్త మ్యాచ్ విన్నర్ అని ఆమెకి తెలుసు. దీంతో విన్నింగ్ రన్స్ కొట్టేసరికి పట్టలేని సంతోషంతో ఆమె కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మొత్తానికి సికిందర్ రాజా విన్నింగ్ రన్స్ కొట్టడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.