టీమిండియాలో మరో రన్ మెషీన్! సచిన్, కోహ్లీ వారసుడు దొరికేశాడు!

భారత క్రికెట్ లో బ్యాటర్లకు ఎప్పుడు లోటు లేదు.దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ నుండి ఇప్పుడు కోహ్లీ వరకు అసాధారణ బ్యాటింగ్ తో కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచమంతా రికార్డులు సెట్ చేసిన ఘనత మన ఇండియన్ బ్యాటర్ల సొంతం. కోహ్లీ శకం ఇక దగ్గరపడనుండడంతో అతని వారసుడు ఎవరనే చర్చ ఒక యువ బ్యాటర్ భారత క్రికెట్ కి ఆశాకిరణంలా మారాడు.

భారత క్రికెట్ లో బ్యాటర్లకు ఎప్పుడు లోటు లేదు. తరతరాలుగా టీమిండియాకు నాణ్యమైన బ్యాటర్లు వస్తూనే ఉన్నారు. అయితే ఎంత మంది క్వాలిటీ బ్యాటర్లున్నా.. ఒక్కో తరంలో ఒక్కో బ్యాటర్ భారత్ జట్టుకి ఒంటి చేత్తో విజయలానదించడం మనం చూస్తూనే ఉన్నాం. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ నుండి ఇప్పుడు కోహ్లీ వరకు అసాధారణ బ్యాటింగ్ తో కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచమంతా రికార్డులు సెట్ చేసిన ఘనత మన ఇండియన్ బ్యాటర్ల సొంతం. అయితే ప్రస్తుతం కోహ్లీ శకం ఇక దగ్గరపడనుండడంతో అతని వారసుడు ఎవరనే చర్చ మొదలైంది. ఈ సమయంలో ఒక యువ బ్యాటర్ భారత క్రికెట్ కి ఆశాకిరణంలా మారాడు. అతడెవరో కాదు “శుభమాన్ గిల్“.

భారత జట్టు క్రికెట్ లోకి అడుగుపెట్టి ఎన్నో ఏళ్ళైనా.. 1970 నుంచి భారత్ కి క్రికెట్ లో మంచి గుర్తింపు వచ్చింది. దానికి ప్రధాన కారణం సునీల్ గవాస్కర్ అని చెప్పుకోవాలి. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గవాస్కర్ బ్యాటింగ్ చేస్తూ.. టెస్టు క్రికెట్ లో తొలిసారి 10000 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. బౌలర్ల మీద ఎదురు దాడికి దిగడం అప్పట్లో ఈ లిటిల్ మాస్టర్ కే దక్కింది. ఓ వైపు పరుగులు, మరో వైపు సెంచరీలు కొడుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే సునీల్ గవాస్కర్ తర్వాత టీమిండియాకు అంతటి బ్యాటర్ రాడని భావించారంతా. కానీ ఒక 16 ఏళ్ళ కుర్రాడు క్రికెట్ లోకి అడుగు పెట్టి అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.

1990ల్లో మొదలైన సచిన్ హవా.. దాదాపు 2 దశాబ్దాల పాటు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా సాగింది. తన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేకపోయారు. సచిన్ సృష్టించిన రికార్డులు చెప్పుకోవాలంటే తవ్వే కొద్ది వస్తూనే ఉంటాయి. జట్టులో అందరూ బ్యాటర్లు చేసే స్కోర్ లో సగం పరుగులు సచిన్ చేసిన చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే అందరూ సచిన్ ని “గాడ్ ఆఫ్ క్రికెట్” అని పిలుస్తారు. అంతేకాదు టీమిండియా క్రికెట్ కి చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న అవార్డు కూడా వరించింది. ఎప్పుడైతే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడో.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డులు ఇంకో 100 సంవత్సరాలైనా అలాగే ఉంటాయనే భావం అందరిలో కలిగింది. అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక ఢిల్లీ కుర్రాడు సచిన్ రికార్డులు బ్రేక్ చేయగలరని ఎవరైనా అనుకుంటారా? కానీ కోహ్లీ.. సచిన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

విరాట్ కోహ్లీ ఈ జెనరేషన్ లో టాప్ ప్లేయర్లలో ఒకడు. ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. 2008 లో అరంగ్రేటం చేసిన కోహ్లీ.. అప్పట్లో చాల మంది గ్రేట్ బ్యాటర్లు జట్టులో ఉండడంతో.. కోహ్లీని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒకొక్కరూ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కోహ్లీ విలువెంటో అందరికీ తెలిసి వచ్చింది. జట్టులో సచిన్ వారసత్వాన్ని నిలబెడుతూ.. ఎన్నో మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీ దూకుడు ఎంత చెప్పుకున్న తక్కువే. సెంచరీలు చేయడం ఇంత సింపుల్ అనేట్లుగా కోహ్లీ బ్యాటింగ్ ఉండేది. ప్రస్తుతం కూడా అత్యున్నత ఫామ్ లో ఉన్న కోహ్లీ.. మరో మూడు, నాలుగేళ్లు కంటే ఎక్కువగా క్రికెట్ లో కొనసాగలేడు. దీంతో ఇప్పుడు కోహ్లీని మైమరపిస్తూ.. శుభమాన్ గిల్ వచ్చిమనట్లుగానే కనపడుతున్నాడు.

అప్ కమింగ్ ప్లేయర్లలో గిల్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. గతేడాది నుంచి మొదలైన గిల్ హవా.. ఈ ఏడాది మరింతగా రాటుదేలాడు. టెస్టు, వన్డే, టీ 20, ఐపీఎల్ ఇలా అన్నిట్లో సెంచరీ కొట్టిన ఘనత గిల్ సొంతం. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ ని ముందుకు నడిపే బ్యాటర్ మరొకడొచ్చాడని గిల్ అందరినుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు గిల్ అని అందరూ చెప్పుకొస్తున్నారు. కోహ్లీ కూడా గిల్ ని ఉద్దేశించి నా తర్వాత జెనరేషన్ ని నువ్వే ముందుకు తీసుకెళ్లాలి అని ఇటీవలే చెప్పడం విశేషం. క్రికెట్ గాడ్ సచిన్ సైతం గిల్ ఆటకు ఫిదా అయిపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అద్భుత ఫామ్ లో ఉన్న గిల్.. వరుస సెంచరీలతో హాట్ టాపిక్ గా మారాడు. మరి ఇండియాకి మరో బ్యాటింగ్ దిగ్గజం దొరికేశాడనే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed