గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ శకం తనదేనని మరోసారి నిరూపించాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో సెంచరీతో చెలరేగిన గిల్.. ఫ్యూచర్ అంతా తనదేనని మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు.
ఐపీఎల్-2023 ఫైనల్స్ బెర్త్‌పై కన్నేసిన గుజరాత్ టైటాన్స్ అనుకున్నది సాధించేలానే ఉంది. ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టైటాన్స్ చెలరేగి ఆడుతోంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (129) సూపర్బ్ ఫామ్‌ను కొనసాగిస్తూ కీలకమైన క్వాలిఫయర్-2లో బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. 60 బాల్స్‌లో 129 రన్స్ చేసిన గిల్ ఇన్సింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 215గా ఉంది. దీన్ని బట్టే గిల్ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. గిల్ ఈ సీజన్లో మూడో సెంచరీతో వీరవిహారం చేయడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. అతడికి తోడుగా సాయి సుదర్శన్ (43), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28) కూడా రాణించడంతో గుజరాత్ ఏకంగా 233 రన్స్ భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో గిల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది.
ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ చితగ్గొట్టాడు శుబ్‌మన్ గిల్. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18)తో కలసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గిల్.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు మంచి స్కోరు చేసింది. ఆ తర్వాత గిల్‌కు సాయి సుదర్శన్ జతవ్వడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. వీళ్లిద్దరూ భారీ షాట్లతో ముంబై బౌలర్లపై అటాకింగ్‌కు దిగారు. దీంతో ప్రత్యర్థి బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆఖర్లో హార్దిక్ పాండ్యా కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. అయితే గిల్ బ్యాటింగ్ సమయంలో ఆడిన ఒక షాట్ హైలైట్‌గా నిలిచింది. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకొచ్చి గిల్ కొట్టిన వింత షాట్ సిక్స్ వెళ్లింది. దీంతో ఇదేం షాట్ రా బాబు అంటూ రోహిత్ కూడా షాకయ్యాడు. మరి.. గిల్ కొట్టిన ఈ షాట్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One of the most outrageous shots by Shubman Gill.
Even Rohit Sharma was in awe of it! pic.twitter.com/xgmfDsFKOW
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2023