ఐపీఎల్ 2023లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ స్టార్ ఓపెనర్ గిల్ ఒక అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. మ్యాచ్ అమాంతం ధనాధన్ బ్యాటింగ్ సాగించిన గుజరాత్ బ్యాటర్లు సన్ రైజర్స్ బౌలర్లను చితగ్గొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఆరంభంలో సాహా వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత దూకుడే మంత్రంగా వీరి బ్యాటింగ్ కొనసాగింది. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ యువ ఆటగాడు సాయి సుదర్శన్(47) సహకారంతో స్కోర్ వేగాన్ని పెంచుతూనే.. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ మ్యాచులో గిల్ ధాటిగా ఆడుతూ ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ స్టార్ ఓపెనర్ గిల్ ఈ సంవత్సరం తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుస సెంచరీలు, వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ సాధించిన గిల్, ప్రస్తుతం సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో సెంచరీ బాది ఐపీఎల్ లో తొలి సెంచరీని నమోదు చేసాడు. మ్యాచ్ అమాంతం సన్ రైజర్స్ బౌలర్లను దంచికొట్టిన గిల్, ఎక్కడా తన దూకుడు తగ్గనివ్వలేదు. నటరాజన్ వేసిన 19 ఓవర్ లో సింగల్ తీసి 56 బంతుల్లో గిల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు , ఒక సిక్స్ ఉండడం విశేషం. దీంతో గిల్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి.
The moment Shubman Gill reached his maiden IPL century.
He loves Narendra Modi Stadium! pic.twitter.com/Jis3WbCxkw
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 15, 2023
ఇక ఈ ఇన్నింగ్స్ తో గిల్ ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లతో పాటుగా.. ఐపీఎల్ లో కూడా సెంచరీ నమోదు చేసిన టీమిండియా తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ మీద వన్డేల్లో, టీ 20ల్లో సెంచరీ చేసిన గిల్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఒకే ఏడాదిలో టీ20, వన్డే, టెస్ట్, ఐపీఎల్.. ఇలా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఘనత గిల్ కి మాత్రమే సాధ్యమైంది. మరి గిల్ నెలకొల్పిన ఈ అరుదైన రికార్డుపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Shubman Gill since December 2022:
Test hundred vs BAN.
ODI hundred vs SL.
ODI Double Hundred vs NZ.
ODI hundred vs NZ.
T20I hundred vs NZ.
Test hundred vs AUS.
IPL hundred vs SRH. pic.twitter.com/t2cugWffyB— Johns. (@CricCrazyJohns) May 15, 2023