ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతోంది. కెరీర్ అత్యున్నత ఫామ్ లో ఉన్నగిల్ ఇప్పుడు రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఏకంగా సెంచరీ బాదేసిన గిల్.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. ఓడిపోయిన జట్టు ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. దీంతో ఈ రెండు జల మధ్య హోరా హోరీ పోరు ఖయామని భావించారంతా. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మొదట నాలుగు ఓవర్లలో ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కనీసం 30 పరుగులైనా చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత గుజరాత్ బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. ముఖ్యంగా ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న శుభమాన్ గిల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో ఈ యంగ్ సెన్సేషన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో గిల్ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కెరీర్ అత్యున్నత ఫామ్ లో ఉన్నగిల్ ప్రస్తుతం రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ 2 మ్యాచులో గిల్ భారీ శతకంతో అదరగొట్టేసాడు. కేవలం 60 బంతుల్లో 129 పరుగులు చేసాడు ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్. ఇందులో 7 ఫోర్లు 10 సిక్సులు ఉండడడం విశేషం. గిల్ సెంచరీతో గుజరాత్ ఈ మ్యాచులో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం గిల్ రికార్డుల ఒకసారి పరిశీలిస్తే..
ఐపీఎల్ ప్లే ఆఫ్ లో మ్యాచులో గిల్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసి సాహా, పటిదార్ సరసన నిలిచాడు. 49 బంతుల్లో గిల్ సెంచరీతో ఈ రికార్డ్ నెలకొల్పగా.. ఈ లిస్టులో సాహా, పటిదార్ కూడా ప్లే ఆఫ్ లో 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం విశేషం. ఇక దాంతో పాటు ఒకే సీజన్ లో 3 సెంచరీలు చేసి కోహ్లీ, బట్లర్ తర్వాతి స్థానాల్లో నిలిచాడు. కోహ్లీ, బట్లర్ 4 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇక ఈ సీజన్ లో వరుసగా రెండు సెంచరీలు చేసిన గిల్ కి ఇది గత నాలుగు ఇన్నింగ్స్ లో మూడో సెంచరీ కావడం గమనార్హం. మొత్తానికి గిల్ నెలకొల్పిన రికార్డులు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.