గిల్ సినిమాలోకి రాబోతున్నాడు. ఈ వార్త విన్న వారెవరైనా షాకవ్వాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. అతని సినిమా అవకాశాలను కొట్టి పారేయలేము. అదేంటి గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా.. మరి సినిమా ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా?
“శుభమన్ గిల్” భారత క్రికెట్లో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్. ఫార్మాట్ ఏదైనా సత్తా చాటే అతి కొద్ది మంది ప్లేయర్లలో గిల్ ఒకడు. ఇక ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టి అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ స్టార్ ఓపెనర్ తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ చేసిన ఒక పని అతను సినిమాల్లోకి రాబోతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. అతని సినిమా అవకాశాలను కొట్టి పారేయలేము. అదేంటి గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా.. మరి సినిమా ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా?
గిల్ సినిమాలోకి రాబోతున్నాడు. ఈ వార్త విన్న వారెవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. అంతే కాదు కోహ్లీ వారసుడిగా భవిష్యత్తులో భారత్ కి అనేక విజయాలను అందిస్తాడని ఇప్పటికే చాలా మంది జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో గిల్ సినిమా ఎంట్రీ అసంభవం అనుకోవచ్చు. కానీ సరిగ్గా ఆలోచిస్తే.. గిల్ సినిమాలోకి వచ్చే అవకాశముందని తాజా ప్రోమో ఒకటి చెబుతుంది. స్పైడర్ మ్యాన్ యాడ్ లో నటించిన గిల్ మాటలతో అదరగొట్టేసాడు. సోనీ పిక్చర్స్ ఎంటర్ ప్రైజెస్ స్పైడర్ మ్యాన్ అనే ఇండియన్ సినిమాని జూన్ 2 న 10 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ ప్రోమో విడుదల చేయగా “నేను మీ ఇండియన్ స్పైడర్ మ్యాన్” అంటూ గిల్ డబ్బింగ్ చెబుతూ ఆకట్టుకున్నాడు.
గిల్ క్రికెట్ తో పాటు సినిమాల్లో కూడా నటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పుకోవాలి. మంచి హ్యాండ్సమ్ గా ఉన్న గిల్ కి బాలీవుడ్ హీరోయిన్లతో పరిచయాలు కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్ చేసినట్లు గతంలో చాలానే వార్తలు వినిపించాయి. అంతే కాదు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కూడా గిల్ ప్రేమాయణం సాగించినట్లుగా గాసిప్స్ వినిపించాయి. దీనికి తగ్గట్లుగానే తాజాగా గిల్ ప్రోమోలో తన డబ్బింగ్ చెబుతూ కనిపించి.. నేను కూడా హీరో రేస్ లో ఉన్నాను అని చెప్పకనే చెప్పాడు. మొత్తానికి ఇటు క్రికెట్ కెరీర్ ని నెట్టుకొస్తానే.. మరోవైపు సినిమా మీద కన్నేసినట్లు అనిపిస్తుంది. మరి గిల్ సినిమా ఎంట్రీ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.