గిల్-సారా రిలేషన్ షిప్ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేక్షకులకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారా? అనే అనుమానం కలిగింది. కానీ తాజాగా గిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో మ్యాచులతో పాటుగా కొన్ని విషయాలు జనాలను బాగా అలరిస్తాయి. వీటిలో కోహ్లీ అనుష్క శర్మ బాండింగ్, కావ్య మారన్ గ్లామర్ ,షారుఖ్-కోహ్లీ డ్యాన్స్, లాంటివి ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది శుభమన్ గిల్, సారా మధ్య వినిపించే గాసిప్స్. వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనే సంగతి పక్కన పెడితే ప్రేక్షకులకి ఏ మాత్రం అవకాశం దొరికినా వీరిద్దరి మీద మీమ్స్ వర్షం కురిపిస్తారు. ఒకప్పుడు వీరిద్దరూ డేటింగ్ కి వెళ్లినట్లు, లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరిని అందరిలో దృష్టిలో పడ్డారు. అయితే అందుకు తగ్గట్లుగానే గిల్ నిన్న షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది.
ఐపీఎల్ లో నిన్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో హార్దిక్ సేన రోహిత్ సేనను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ సంగతి అలా ఉంచితే ఈ మ్యాచుని సరిగ్గా గమనిస్తే తొలి ఓవర్లలో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో శుభమన్ గిల్ ఆడడం నిన్న మ్యాచులో హైలెట్ మారింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. అర్జున్ టెండూల్కర్ అక్క సారా కావడం… గిల్ తో సారా రిలేషన్ షిప్.. ఇదంతా చూస్తుంటే బామ్మర్ది బౌలింగ్ లో బావ ఆడుతున్నట్లు అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే గిల్ తన ఇంస్టాగ్రామ్ లో వెనుక అర్జున్ టెండూల్కర్ ఉన్న ఒక ఫోటోను షేర్ చేయడం విశేషం.
ఈ ఫొటోలో అర్జున్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తూ కనబడ్డాడు. అసలే గిల్ సారా మధ్య గాసిప్స్ ఆగకపోతే ఇప్పుడు గిల్ ఈ ఫోటోను కావాలనే షేర్ చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య వీరిద్దరి గురించి పెద్దగా టాక్ లేకపోయినా .. తాజాగా గిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. దీంతో గిల్ సారా కోసం కావాలనే ఈ ఫోటోని షేర్ చేశాడా ?లేకపోతే ఆ షాట్ నచ్చి అలా పెట్టుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.