వెన్ను గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విదేశాల్లో సర్జరీ చేయించుకోనున్నాడు. ఫలితంగా అతడు ఐపీఎల్‌తో పాటు పలు కీలక సిరీస్‌లకు దూరం కానున్నాడు.
భారత క్రికెట్ జట్టుకు చేదువార్త. వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక సిరీస్‌లకు దూరం కానున్నాడు. అయ్యర్ వెన్ను గాయానికి ఆపరేషన్ విదేశంలో జరగనుందని.. అతడు కోలుకునేందుకు కనీసం ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఫలితంగా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమవుతాడని చెప్పాయి. అలాగే జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ ఆడడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఇండియా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి.
గాయం కారణంగానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో శ్రేయాస్ అయ్యర్ ఆడలేకపోయాడు. అనంతరం ఆసీస్‌తో వన్డే సిరీస్ నుంచి కూడా వైదొలిగాడు. అయ్యర్ గైర్హాజరీలో ఐపీఎల్లో కోల్‌కతా జట్టుకు నితీశ్ రాణా నాయకత్వం వహిస్తున్నాడు. గాయాల కారణంగా ఇప్పటికే బుమ్రా, అయ్యర్, విలియమ్సన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇదే బాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రజత్ పాటిదార్ కూడా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్ సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఏప్రిల్ ఆఖరి వారం వరకు లీగ్‌కు అందుబాటులో ఉండనని చెప్పాడు. ఈ తరుణంలో ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా కింద పడటంతో ఆ టీమ్ పేసర్ రీస్ టాప్లీ గాయపడ్డాడు.
BREAKING: Shreyas Iyer will undergo back surgery and miss #IPL2023 and the World Test Championship Final ❌
The India and KKR batter is set to be out of action for at least three months pic.twitter.com/QnyuPwOB4z
— ESPNcricinfo (@ESPNcricinfo) April 4, 2023