కోల్ కతాతో మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో శివమ్ దూబె అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓ చీర్ గర్ల్ ని గాయపరిచాడు!
ఐపీఎల్ మంచి రంజుగా సాగుతోంది. లీగ్ దశ చివరకు వచ్చేసినా ప్లే ఆఫ్స్ కి ఎవరెవరు వెళ్తున్నారనేది అస్సలు క్లారిటీ రావడం లేదు. మొన్నటివరకు టాప్ టీమ్స్ ఫుల్ జోష్ లో కనిపించాయి కానీ ఇప్పుడు ఆ జట్లు చిన్న చిన్న టీమ్స్ చేతుల్లో ఓడిపోతున్నాయి. తాజాగా చెన్నై కూడా సేమ్ ఇలానే కోల్ కతా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ క్రికెటర్ వల్ల చీర్ గర్ల్ కి గాయాలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో చెన్నై టీమ్ హోమ్ గ్రౌండ్ లో తన చివరి మ్యాచ్ ఆడేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 144/6 స్కోరు చేసింది. ఛేదనలో కేకేఆర్ అద్భుతంగా ఆడింది. 18.3 ఓవర్లలో మ్యాచ్ ని ముగించేసింది. కోల్ కతా తరఫున కెప్టెన్ నితీష్ రానా, రింకూ సింగ్ సూపర్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. విజయానికి కారణమయ్యారు. అదే చెన్నై టీమ్ లో శివమ్ దూబె ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
అయితే శివమ్ దూబె.. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 12వ ఓవర్ లో కేకేఆర్ బౌలర్ సుయాష్ వేసిన బంతిని ఎక్స్ ట్రా కవర్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే అది తిన్నగా వెళ్లి బౌండరీ దగ్గర కూర్చుని ఉన్న కోల్ కతా చీర్ గర్ల్ కి తగిలింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. ఇదేమెంత పెద్దగా దెబ్బ కాకపోవడం, ఆమె టైమ్ రెస్పాండ్ అయి పక్కకు తప్పుకోవడం.. అందరూ హమ్మయ్యా అనుకునేలా చేసింది ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. సరేలే గానీ దూబె సిక్స్ కి చీర్ గర్ల్ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
All 30 sixes of Shivam Dube pic.twitter.com/B4LHp19o42
— Dhoni – 𒆜ᏞᎬǤᎬN̷Đ𒆜MᏚD❼ (@MSD_071113) May 15, 2023