పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ లో అరుదైన రికార్డు సెట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన చేరడం విశేషం.
ఓపెనర్లలో శిఖర్ ధావన్ కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. రోహిత్ శర్మతో కలిసి చాలా మ్యాచుల్లో టీమిండియాని గెలిపించాడు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో మనోడిని పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో ఈసారి మొదలవడానికి ముందు ధావన్ పై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. కానీ అనుహ్యంగా బాగా ఆడేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తనదైన మార్క్ చూపిస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డుని చేరుకున్నాడు. ఇంతకీ ఏంటా రికార్డు?
అసలు విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్ స్టార్టింగ్ లో కాస్త బోరింగ్ గా అనిపించింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు వస్తోంది. ఎవరు గెలుస్తారో అనే టెన్షన్ ఉంటూనే ఉంది. తాజాగా పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ లోనూ సేమ్ అలానే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 179/7 స్కోరు చేసింది. కెప్టెన్ ధావన్ 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. చివరి బంతి వరకు మ్యాచ్ ని తీసుకొచ్చినప్పటికీ 182 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రింకూ సింగ్, రసెల్.. ఈ గెలుపులో కీలక పాత్రపోషించారు. సరే ఇది కాస్త పక్కనబెడితే ధావన్ ఈ మ్యాచ్ లో చేసిన హాఫ్ సెంచరీతో కలిపి ఐపీఎల్ లో మొత్తం 50 అర్ధ శతకాల మార్క్ ని అందుకున్నాడు. దీంతో కోహ్లీ సరసన చేరాడు. వీళ్ల కంటే ముందు డేవిడ్ వార్నర్ 59 హాఫ్ సెంచరీలతో ఉన్నాడు. సో అదన్నమాట విషయం. మరి ధావన్ రికార్డు సృష్టించి, కోహ్లీ సరసన చేరడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.