కెప్టెన్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఇక ఎప్పుడు తనదైన షాట్స్ తో విరుచుకుపడే ధావన్.. ఈ మ్యాచ్ లో మాత్రం తన శైలికి విరుద్దంగా షాట్స్ ఆడి మెప్పించాడు. ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్సే ఆడాడు ధావన్ ఈ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ లో ధావన్ రివర్స్ స్వీప్ లో కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి.
ఐపీఎల్ 2023లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో యంగ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఇక ఎప్పుడు తనదైన షాట్స్ తో విరుచుకుపడే ధావన్.. ఈ మ్యాచ్ లో మాత్రం తన శైలికి విరుద్దంగా షాట్స్ ఆడి మెప్పించాడు. ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్సే ఆడాడు ధావన్ ఈ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ లో ధావన్ రివర్స్ స్వీప్ లో కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఇలాంటి సిక్స్ ఏబీ డివిల్లియర్స్ కూడా కొట్టలేడు అంటే అతిశయోక్తికాదు.
ఐపీఎల్ లో భాగంగా.. బుధవారం(ఏప్రిల్ 5)న పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాటర్లు.. రాజస్థాన్ బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ధాటికి వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన బౌల్ట్, అశ్విన్, చాహల్ లు బెంబేలెత్తిపోయారు. ప్రభ్ మన్ సింగ్-ధావన్ లు తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ప్రభ్ సిమ్రన్.
అనంతరం గేర్ ఛేంజ్ చేశాడు ధావన్.అప్పటి వరకు నెమ్మదిగా ఆడుతున్న పంజాబ్ కెప్టెన్ ఒక్కసారిగా ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగడం మెుదలు పెట్టాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు ధావన్. ఇక ఈ మ్యాచ్ లో ధావన్ ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్స్ ఆడాడు. ఇక ధావన్ హోల్డర్ వేసిన ఓవర్ లో కొట్టిన సిక్స్ మ్యాచ్ మెుత్తానికే హైలెట్ అని చెప్పక తప్పదు.రాజస్థాన్ బౌలర్ హోల్డర్ వేసిన 17వ ఓవర్ 5 బంతిని ధావన్ సిక్సర్ గా మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. రివర్స్ స్వీప్ లో కచ్చితమైన టైమింగ్ తో బంతిని సిక్సర్ గా మలిచిన తీరు అద్భుతం. ఈ షాట్ చూసిన తర్వాత ఇలాంటి షాట్ మిస్టర్ 360గా పిలుచుకునే ఏబీ డివిల్లియర్స్ కూడా కొట్టలేడేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతలా ధావన్ ఈ షాట్ ను కొట్టాడు.
ఈక్రమంలోనే 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక ధావన్ కు ఆఖరి ఓవర్ లో స్ట్రైకింగ్ రాలేదు.. వస్తే సెంచరీ చేసేవాడే అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 198 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 2వ ఓవర్లోనే జైస్వాల్ (11) వికెట్ ను కోల్పోయింది.
Nothing just the class of Shikhar Dhawan pic.twitter.com/hhDH6ZKE4g
— feryy (@ffspari) April 5, 2023