Shikhar Dhawan, Rohit Sharma: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వీరిద్దరిది మంచి ఓపెనింగ్ జోడీ.. కానీ జట్టులో మార్పులు చేర్పులతో ప్రస్తుతం ధావన్ జట్టులో లేకుండా పోయాడు.. కానీ ఐపీఎల్ ఫామ్‌తో ఇప్పుడు రోహిత్‌కి కౌంటర్ ఇస్తున్నాడు.
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం గుజరాత్ టైటాన్స్-కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే ఊహించని విధంగా ముగిసింది. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఐపీఎల్‌కి భారీ హైప్ వచ్చి పడింది. ఆ తర్వాత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. అతనొక్కడు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఆ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ఛేదించి గెలిచింది.
అయితే.. పంజాబ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇచ్చారు. అయితే.. పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన ధావన్.. ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడు నా స్ట్రైక్‌రేట్ అతనికి నచ్చింది అనుకుంటున్నా’ అంటూ హర్ష భోగ్లేకి కౌంటర్ ఇచ్చాడు. అంతకు ముందు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 56 బంతుల్లో 86 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కామెంటేటర్ భోగ్లే ధావన్ బాగా ఆడుతున్నా.. స్ట్రైక్‌రేట్ మెరుగుపర్చుకోవాలని సూచించాడు.
తాజాగా సన్‌రైజర్స్‌పై 66 బంతుల్లో 99 పరుగులు చేసిన తర్వాత.. ఇప్పుడు నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ భోగ్లేకు నచ్చి ఉంటుందని అన్నాడు. అయితే.. ఇది పేరుకే భోగ్లేకి కౌంటర్‌లా ఉన్నా.. అసలైన కౌంటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకే అంటూ క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. చాలా కాలంగా టీమిండియాలో కీలక ప్లేయర్‌గా, రోహిత్‌కు మంచి ఓపెనింగ్ జోడీగా ఉన్న శిఖర్ ధావన్‌ను తొలుత టీ20, ఆ తర్వాత వన్డే జట్టు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. స్ట్రైక్‌రేట్ సరిగా లేదనే కారణంగానే ధావన్‌ను జట్టు నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి. అది కూడా రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాతే వన్డే టీమ్‌లో ధావన్ ప్లేస్ కోల్పోయాడు. ఇప్పుడు వరల్డ్ కప్ కోసం అతన్ని పరిగణంలోకి తీసుకుంటారా? లేదా ? అనేదే పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు నా స్ట్రైక్ ఎలా ఉంది? అని ధావన్ పరోక్షంగా రోహిత్‌కు కౌంటర్ ఇచ్చినట్లుగా క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషంయలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shikhar Dhawan with Rohit Sharma in 2023 world cup. One last ride. 🥺🥺 pic.twitter.com/CYTDVSlzod
— ANSHUMAN🚩 (@AvengerReturns) April 9, 2023