Shikhar Dhawan: టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశారు. కోహ్లీ తర్వాత అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచిన ధావన్.. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రాన్ రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడు. కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేసి.. దడదడలాడించాడు. అతను ఉన్నంతసేపు నిదానంగా ఆడిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్.. ప్రభ్‌సిమ్రాన్ అవుటైన తర్వాత.. జూలు విదిల్చాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చివర్లో జితేష్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేయడంతో పంజాబ్‌కు మంచి స్కోర్ వచ్చింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి.. 5 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. రాజస్థాన్‌పై సాధించిన హాఫ్ సెంచరీతో ధావన్ ఐపీఎల్ 48వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
50 ప్లస్ స్కోర్లు 50 సార్లు సాధించాడు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 45 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. అయితే.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ 56 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వార్నర్‌కి 56 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే వార్నర్ తర్వాత ధావన్ 48, కోహ్లీ 45 ఫిఫ్టీలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మరి ధావన్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shikhar Dhawan#IPL2023 #RRvPBKS pic.twitter.com/UI3RIjOWGx
— RVCJ Media (@RVCJ_FB) April 5, 2023