చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్, పంజాబ్ తో మ్యాచ్ లో పట్టిన క్యాచ్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది. దాని వెనకున్న షాకింగ్ మ్యాటర్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ పేరు చెప్పగానే క్రికెట్ ఫ్యాన్స్ కి ఎక్కడలేని హ్యాపీ. ధనాధన్ బ్యాటింగ్ ఉండే ఈ లీగ్ కోసం ప్రతి ఏడాది తెగ వెయిట్ చేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా పేరు తెచ్చుకున్న ఐపీఎల్ పై వివాదాలు, ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. గతంలో ఫిక్సింగ్ ఆరోపణల వల్ల చెన్నై, రాజస్థాన్ జట్లని చెరో రెండేళ్లపాటు టోర్నీ నుంచి నిషేధించారు. అది జరిగి చాలా కాలమైంది. ఆ జట్లు మళ్లీ టోర్నీలో ఆడుతున్నాయి. అయినాసరే ఐపీఎల్ లో ఈ మధ్య కాలంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ‘ఫిక్సింగ్’ అనే మాట బాగా వైరల్ అవుతోంది. తాజాగా చెన్నై-పంజాబ్ మ్యాచ్ లోనూ అలాంటి ఓ సంఘటనే జరిగింది. ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు 15 సీజన్లు జరిగాయి కానీ ఈసారి ఎందుకో ఐపీఎల్ పై తెగ నెగిటివిటీ వస్తోంది. సోషల్ మీడియాలో అయితే ప్రతి మ్యాచ్ లోనూ ఫిక్సింగ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే కొన్ని మ్యాచుల్లో డౌట్ వచ్చే సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన చెన్నై-పంజాబ్ మ్యాచ్ లో సేమ్ అలాంటిదే జరిగింది. పంజాబ్ ఛేదనలో ఉంది. 10 బంతుల్లో 15 పరుగులు చేస్తే గెలిచేస్తుంది. 19వ ఓవర్ తుషార్ దేశ్ పాండే బౌలింగ్ చేశాడు. మంచి ఊపు మీదున్న జితేష్ శర్మ.. లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. సబ్ స్టిట్యూట్ గా వచ్చిన షేక్ రషీద్.. బౌండరీ లైన్ దగ్గర అదిరిపోయే క్యాచ్ పట్టాడు.
అయితే ఈ క్యాచ్ పట్టే క్రమంలో రషీద్ కాలు.. బౌండరీ లైన్ ని తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ గా ప్రకటించాడు. అయితే బౌండరీ రోప్ లో ఎలాంటి కదలిక లేకపోవడంతోనే ఇలా ఔట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అక్కడున్నది చెన్నై సూపర్ కింగ్స్ కావడంతో.. ఫిక్సింగ్ అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. చెన్నైని గెలిపించడానికి ప్రయత్నాలు జరిగాయని కూడా తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 200/4 స్కోరు చేయగా, 201 రన్స్ కొట్టిన పంజాబ్ గెలిచేసింది. సరే ఇదంతా పక్కనబెడితే.. సీఎస్కే ఫీల్డర్ పట్టిన క్యాచ్ ఔట్ లేదా నాటౌట్? ఇంతకీ మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
— IPLT20 Fan (@FanIplt20) April 30, 2023