Shah Rukh Khan, Virat Kohli: కింగ్ ఎవరనే విషయంలో వారిద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. కానీ, ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ-షారూఖ్ కలిసి డ్యాన్స్ వేయడంతో గొడవలన్నీ..
ఒకరేమో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తారు. మరొకరేమో క్రికెట్‌లో ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ ఉంటారు. వీరి దారులు వేరైనా గమ్యం మాత్రం అభిమానులని సంపాదించుకోవడమే. దేశంలో వారి వారి రంగాల్లో ఇద్దరూ విపరీతమైన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్నారు. ఎన్నో సాధించారు. ఎంతో సంపాదించారు. మరో కొన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరని క్రేజ్ వీరిద్దరి సొంతం. వీరిలో ఒకరు బాలీవుడ్ బాద్ షా , దేశంలో అగ్ర నటుల్లో ఒకరైన షారుఖ్ ఖాన్ అయితే.. మరొకరు ఇండియన్ క్రికెట్ సెన్సేషన్ కింగ్ విరాట్ కోహ్లీ. వీరిలో ఒకరిని చూస్తేనే అభిమానుల కోలాహలం నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఇక ఇద్దరు ఒక చోట కలిసిన వేళ.. అభిమానులకే కాదు మొత్తం దేశానికే ముచ్చట గొలిపేలా ఉంటుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ ఇద్దరి స్టార్లను ఒక్క చోటుకి చేర్చింది.
ఐపీఎల్ ల్లో భాగంగా నిన్న కోల్ కత్తా, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సంగతి అలా ఉంచితే.. ఈ మ్యాచ్ కి ముందు షారుఖ్, విరాట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చారు. టాస్ కి ముందు గ్రౌండ్లో కోహ్లీ, షారుక్ ఒకటై కాస్త సరదాగా చిందేశారు. పఠాన్ సినిమాలో పాటకు షారుఖ్.. కోహ్లీకి డ్యాన్స్ నేర్పిస్తూ కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతే కాదు కోహ్లీ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుపోవడం అందరిని ఆకట్టుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అసలైన ‘కింగ్’ ఎవరనే విషయంలో కోహ్లీ, షారుఖ్ అభిమానుల మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వీరిద్దరూ ఇలా కలిసి సరదాగా చిందేయడం.. వారి ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు పటాపంచలయ్యాయి.
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత శార్దూల్(68) రింకు సింగ్(46) మెరుపులతో 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో గుర్బాజ్ అర్ధ సెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకి ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ శుభారంభానిచ్చినా.. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో ఆర్సీబీ జట్టు కేవలం 123 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కనపెడితే షారుఖ్ ఖాన్, కోహ్లీ కలిసి చిందేయటం నిన్న మ్యాచ్ కి హైలెట్ గా నిలిచింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Full video between the bond of Shahrukh Khan & Virat Kohli – This is beautiful. #IPLonStar pic.twitter.com/udZeuobd96
— Johns. (@CricCrazyJohns) April 7, 2023
A lovely video from yesterday.
Virat Kohli and Shahrukh Khan. pic.twitter.com/WgVNKLPYKG
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023