ఆర్సీబీతో మ్యాచులో రాజస్థాన్ ఓడిపోయింది. కానీ ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంపైర్ తో గొడవనే ఇందుకు రీజన్. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ లో మిగతా జట్లతో పోలిస్తే.. రాజస్థాన్ రాయల్స్ కాస్త డిఫరెంట్. టోర్నీలో అండర్ డాగ్స్ అంటే ఈ జట్టే గుర్తొస్తుంది. అంటే పెద్దగా ఫేమ్ ఉండదు కానీ పెద్ద పెద్ద టీమ్స్ కి షాకిస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో కూడా అలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చింది. గుజరాత్, చెన్నై లాంటి స్టార్ క్రికెటర్లున్న జట్లపై గెలిచిన రాజస్థాన్.. లక్నో, బెంగళూరు లాంటి సాధారణ టీమ్స్ చేతిలో ఓడిపోయింది. సరే దాని గురించి వదిలేయండి కానీ ఇప్పుడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. దానికి ఓ గొడవనే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ఆర్సీబీతో రాజస్థాన్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. చివరి ఓవర్ వరకు అయిన ఈ పోరులో విజయం బెంగళూరు జట్టునే వరించింది. టాస్ ఓడిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ డకౌట్ అయ్యాడు గానీ డుప్లెసిస్ 62, మ్యాక్స్ వెల్ 77 రన్స్ కొట్టి సూపరో సూపర్ అనిపించారు. ఛేదనలో రాజస్థాన్.. 182 రన్స్ మాత్రమే కొట్టింది. 7 పరుగుల తేడాతో ఓడిపోయిది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ సందర్భంగా పవర్ ప్లేలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. ఇది పూర్తయిన తర్వాత సాధారణంగా రెండున్నర నిమిషాల టైమ్ ఔట్ ఇస్తుంటారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో అది జరగలేదు.
నార్మల్ గానే టైమ్ ఔట్ అనుకుని సంజూ శాంసన్.. టీమ్ మెంబర్స్ మ్యాచ్ స్థితి డిస్కషన్ చేద్దామనుకున్నాడు. కానీ అంపైర్ వచ్చి ఇది బ్రేక్ మాత్రమే అని చెప్పడంతో అవాక్కయ్యాడు. ఏకంగా ఫీల్డ్ అంపైర్ తోనే గొడవ పెట్టుకున్నాడు! కోచ్ కుమార సంగక్కర కూడా అంపైర్ దగ్గరకి వచ్చి ఈ టైమ్ ఔట్ ఇవ్వకపోవడం గురించి డిస్కస్ చేశాడు. 7 ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చారు అదే విషయం. అయితే గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నారు కాస్త ప్రశాంతంగా డిస్కస్ చేసుకోవాల్సింది పోయి.. ఏకంగా అంపైర్ తో గొడవ పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి సంజూ శాంసన్, అంపైర్ తో గొడవ పడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.