Sanju Samson: రాజస్థాన్ ఓటమికి కారణం సందీప్ శర్మనే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. అసలు రాజస్థాన్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చేసిన రెండు ప్రధాన తప్పిదాలే కారణం.
ఐపీఎల్ 2023లో మరో సంచలన విజయం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ టార్గెట్‌ను ఛేదించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎవరూ ఊహించని విజయం సాధించింది. చివరి బాల్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్భుత వినోదాన్ని అందించింది. సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో ధోని లాంటి బెస్ట్ ఫినిషర్‌ను అడ్డుకుని హీరోగా నిలిచిన సందీప్ శర్మ.. ఈ ఓవర్ వేసేందుకు వచ్చాడు. కానీ, యువ క్రికెటర్ అబ్దుల్ సమద్ దూకుడు ముందు నిలవలేకపోయాడు. ఒత్తిడికి చిత్తై.. చివర్లో ఓ నో బాల్ వేసి.. రాజస్థాన్ కొంపముంచాడు. అయితే.. రాజస్థాన్ ఓటమికి కారణం సందీప్ శర్మనే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. అసలు రాజస్థాన్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చేసిన రెండు ప్రధాన తప్పిదాలే కారణం.
సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో రాజస్థాన్ ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. శాంసన్ సైతం రెండు క్యాచులు వదిలేశాడు. రాహుల్ త్రిపాఠీ ఇచ్చిన ఈజీ క్యాచ్ కూడా నేలపాలు చేశాడు. దానికితోడు తను వేసిన రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చిన మురుగన్ అశ్విన్‌కు మూడోసారి బంతి ఇవ్వడం కూడా రాజస్థాన్ ఓటమికి కారణం. తమ వద్ద మరో బౌలింగ్ ఆప్షన్ ఉంచుకుని కూడా సంజు మురుగన్‌కు బౌలింగ్ ఇవ్వడం రాజస్థాన్ కొంపముంచినట్లు చెప్పుకొవచ్చు. అలాగే చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు డిఫెండ్ చేసుకోవాల్సిన ఉన్నప్పుడు ఏ కెప్టెన్ అయినా సరే 19వ ఓవర్లోనే ప్రత్యర్థికి అవకాశాలు లేకుండా చేస్తాడు.
సందీప్ శర్మ, ఓబెడ్ మెకాయ్ వంటి డెత్ ఓవర్ స్పెషలిస్టులు కూడా కుర్ర బౌలర్ కుల్దిప్ యాదవ్‌కు బంతి ఇచ్చాడు సంజు. ఈ అవకాశాన్ని గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఇలా కెప్టెన్‌గా సంజు శాంసన్ చేసిన తప్పిదాలే.. ప్రధానంగా భారీ స్కోర్ చేసినా కూడా రాజస్థాన్ ఓటమికి కారణంగా నిలిచాయి. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్.. సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘You can never never never feel that you’ve won the game’ – Sanju Samson
Still thinking about last night?https://t.co/J75lvuBXQD #RRvSRH #IPL2023 pic.twitter.com/Xp40DEatvk
— ESPNcricinfo (@ESPNcricinfo) May 8, 2023