Sanju Samson, Devdutt Padikkal: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేజేతులా ఓడినట్లు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దేవదత్త్ పడిక్కల్ జిడ్డు బ్యాటింగ్‌తోనే రాజస్థాన్ ఓడిందని మండిపడుతున్నారు. అయితే.. పడిక్కల్ జిడ్డు బ్యాటింగ్ కంటే కూడా.. కెప్టెన్‌గా శాంసన్ చేసిన పొరపాటే రాజస్థాన్ ఓటమికి కారమైందంటున్నారు క్రికెట్ నిపుణులు..
బాగా ఆడుతున్న ఓపెనింగ్ జోడీని మారిస్తే ఫలితం ఎలా ఉంటుందో నిన్న మ్యాచుతో కెప్టెన్ సంజు శాంసన్‌కి బాగా తెలిసొచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ ఈ విషయంపై వివరణ ఇచ్చి.. తప్పించుకున్నా జట్టు ఓటమికి అతనే బాధ్యుడు అని తెలుస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయొచ్చు గాని.. ప్రయోగాలు మాత్రం చేయకూడదు. కెప్టెన్ శాంసన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం బెడిసి కొట్టడంతో రాయల్స్ జట్టుకి ఓటమి తప్పలేదు. అసలు శాంసన్ ఏం చేసాడంటే ?
నిన్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ జట్టుపై 5 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి ప్రధాన కారణం పడిక్కల్ స్లో గా బ్యాటింగ్ చేయడమే అని అందరూ భావిస్తున్నారు. కానీ సరిగ్గా ఆలోచిస్తే అసలు కారణం కెప్టెన్ శాంసన్ అని తెలుస్తుంది. అదేంటి అతను 42 పరుగులతో టాప్ స్కోరర్ కదా.. మరి అతను చేసిన తప్పేంటి అనే సందేహం మీలో రావచ్చు. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో జైస్వాల్ తో పాటు ఆశ్చర్యకరంగా అశ్విన్ ఓపెనింగ్ కి వచ్చాడు. అయితే సంజు తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికీ నచ్చలేదు. బట్లర్ చేతి వేలికి గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేకపోయాడు అని మ్యాచ్ అనంతరం క్లారిటీ ఇచ్చాడు. అయితే .. ఓపెనర్ పడిక్కల్ జట్టులో ఉండగా అశ్విన్ తో ఓపెనింగ్ చేయించాల్సిన అవసరమేముంది? ఈ విషయమై ఆరాతీస్తే..
ఐపీఎల్లో ఓపెనర్ గా పడిక్కల్ కి మంచి రికార్డ్ ఉంది. ఆర్సీసీబీ తరపున గతంలో ఎన్నో మంచి ఇన్నింగ్స్ లు ఆడిన ఘనత పడికల్ సొంతం. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చిన తర్వాత జట్టులో బట్లర్, జైస్వాల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉండడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ ని మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని జట్టు యాజమాన్యం భావించింది. దీంతో గతేడాది నుంచి రాయల్స్ జట్టులో నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. బట్లర్ బ్యాటింగ్ కి రాలేని స్థితిలో పడికల్ ని ఓపెనింగ్ కి పంపించకుండా తగిన మూల్యం చెల్లించుకుంది రాజస్థాన్ రాయల్స్. పడిక్కల్‌ని కాదని అశ్విన్‌ని ఓపెనర్‌గా పంపగా అతడు డకౌట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ ఒక బౌలింగ్ ఆల్ రౌండర్. ఓపెనింగ్ చేసిన దాఖలాలు కూడా లేవు. మరి ఇంత పెద్ద మిస్టేక్ చేసిన శాంసన్‌ను వదిలేసి ఇపుడు అందరూ పడిక్కల్ ని టార్గెట్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Wanted Devdutt Padikkal to bat down to counter PBKS spinners: Sanju Samson
📰 The Royals decided to open the batting with R Ashwin as Jos Buttler was receiving treatment for his injured finger.
🔗https://t.co/eheCMTmFRx#RRvPBKS | #Devduttpadikkal | #RR | #SanjuSamson pic.twitter.com/SqXL7VRid5
— Cricket.com (@weRcricket) April 6, 2023