ప్రస్తుతం ఐపీఎల్ అత్యున్నత జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ప్లేయర్లతో కళ కళ లాడుతుంది. అయితే.. ఏమైందో తెలియదు గాని ఇప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
ప్రస్తుతం ఐపీఎల్ అత్యున్నత జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ప్లేయర్లతో కళ కళ లాడుతుంది. బట్లర్, జైస్వాల్, సంజు శాంసన్, హెట్ మయర్ లాంటి బ్యాటింగ్ దళంతో, బోల్ట్, సందీప్ శర్మ లాంటి పేసర్లతో, ఇక చాహల్, అశ్విన్, జంపా లాంటి అంతర్జాతీయ స్పిన్నర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తుంది. దాని తగ్గట్లే గత సీజన్ లో టాప్ 2 లో స్థానం సంపాదించుకొని ప్లే ఆఫ్ కి కూడా వెళ్ళింది. ఈ సారి కూడా తొలి హాఫ్ సీజన్ ముగిసేసరికి 7 మ్యాచుల్లో 5 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ ని దాదాపుగా కంఫర్మ్ చేసుకుంది. అయితే.. ఏమైందో తెలియదు గాని ఇప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ప్లే ఆఫ్ కి ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచులో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. జితేష్ శర్మ(44), సామ్ కరన్(49), షారుఖ్ ఖాన్ (41) పరుగులతో రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ జైస్వాల్(50) తో పాటుగా. పడికల్ (51), హెట్ మేయర్(46) చెలరేగడంతో మరో మూడు బంతులుండగానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో రాజస్థాన్ 18.5 ఓవర్లలోనే విజయం సాధిస్తే నాలుగో స్థానంలో నిలిచేది. కానీ అలా చేయలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఇదే విషయంపై సంజు శాంసన్ స్పందించాడు.
“గ్రీజ్ లో హెట్ మేయర్ ఉండడంతో 18.5 ఓవెన్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని భావించాం. కానీ అలా జరగలేదు. టోర్నీ ప్రధమార్ధంలో మేము చాలా బాగా ఆడాము. దురదృష్టవశాత్తు ఆ విన్నింగ్ స్ట్రీక్ ని కొనసాగించలేకపోయాము. మా జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లున్నారు. అయినా కూడా పాయింట్ల పట్టికలో మా స్థానాన్ని చూస్తుంటే కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది. జైస్వాల్ 100 మ్యాచులు అనుభవమున్న ప్లేయర్ లా ఆడాడు. బోల్ట్ కూడా అనుకున్నట్లుగానే మాకు శుభారంభాలనిచ్చాడు. కానీ కొన్ని గెలవాల్సిన మ్యాచుల్లో మేము ఓడిపోవడం మా ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బ తీసింది” అని శాంసన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాజస్థాన్ ప్లే ఆఫ్ కి చేరాలంటే బెంగళూరు తో పాటుగా ముంబై జట్టు కూడా ఖచ్చితంగా ఓడిపోవాలి. ఒకవేళ ఆర్సీబీ 3 పరుగుల తేడాతో ఓడిపోయినా రాజస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మొత్తానికి సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.