లాస్ట్ ఓవర్ లో ధోనిని ఆపగలగడం అంటే చిన్న విషయం కాదు. అలా ధోనిని ఆపాలి అంటే ఎన్ని గట్స్ ఉన్న బౌలర్ కైనా, ఒక పక్క వణుకే. మరి అలాంటి ధోనిని నిలువరించి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు సందీప్ శర్మ.
సాధారణంగా ఏ రంగాల్లోనైనా అపారమైన ప్రతిభ ఉండి.. వెలుగులోకి రాకుండా కొంత మంది వ్యక్తులు ఉంటారు. అలాంటి అండర్ రేటెడ్ ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచంలో కోకొల్లలు. ఇప్పుడు అలాంటి అండర్ రేటెడ్ ఆటగాడి గురించే మనం చెప్పుకోబోతున్నాం. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా పేరుగాంచిన మిస్టర్ కూల్ ధోనిని.. లాస్ట్ ఓవర్ లో ఆపగలగడం అంటే చిన్న విషయం కాదు. అలా ధోనిని ఆపాలి అంటే ఎన్ని గట్స్ ఉన్న బౌలర్ కైనా, ఒక పక్క వణుకే. మరి అలాంటి ధోనిని నిలువరించి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు సందీప్ శర్మ. ఐపీఎల్ లో 10 సంవత్సరాలుగా ఆడుతూ.. అద్భుతమైన ప్రదర్శనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా మరోసారి తన సత్తా ఏంటో ఈ మ్యాచ్ ద్వారా అందరికి తెలిసేలా చేశాడు.
సందీప్ శర్మ.. ప్రస్తుతం అందరి నోటా.. ఇదే పేరు వినిపిస్తోంది. అందుకు కారణం అతడు వేసిన ఓకే ఒక్క ఓవర్ బౌలింగ్. అదేంటి ఒక్క ఓవర్ వేసినందుకే ఇంత ఎలివేషన్ అవసరమా? అంటే.. అవసరమే అని చెప్పాలి. ఎందుకుంటే అతడు బౌలింగ్ వేసింది వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనికి. తాజాగా ఐపీఎల్ 2023లో భాగంగా.. బుధవారం రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ లో ధోని ఉన్నాగానీ చెన్నై జట్టును గెలిపించలేకపోయాడు. దానికి కారణం బౌలర్ సందీప్ శర్మ. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించాలి అంటే చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజ్ లో ధోని, జడేజాలు ఉన్నారు. దాంతో చెన్నై విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. ఇక లాస్ట్ ఓవర్ వేయడానికి స్వింగ్ బౌలర్ సందీప్ శర్మ వచ్చాడు.
అయితే ధోని క్రీజ్ లో ఉండటంతో కాస్త ఒత్తిడికి లోనైన సందీప్ శర్మ తొలి రెండు బాల్స్ ను వైడ్ గా వేశాడు. తర్వాత బాల్ ను డాట్ చేశాడు సందీప్. ఆ తర్వాత రెండు బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు ధోని. దాంతో స్టేడియం మెుత్తం హోరెత్తిపోయింది. ఇక చెన్నై సమీకరణాలు 3 బంతుల్లో 7 పరుగులకు చేరుకుంది. దాంతో చెన్నై విజయం ఖాయం అనిపించింది. అయితే గొప్పగా పుంజుకున్న సందీప్ శర్మ.. తన ఐపీఎల్ అనుభవాన్ని అంతా రంగరించి చివరి మూడు బంతులకు కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో రాజస్థాన్ అద్భుతమైన విజయం సాధించింది. ఇక ధోని లాంటి ఫినిషర్ ను నిలువరించిన సందీప్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సందీప్ తన 10 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను తమ తమ జట్లకు అందించాడు. ఐపీఎల్ లో పంజాబ్, సన్ రైజర్స్ జట్లకు ఆడిన సందీప్ శర్మ.. అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ కు సందీప్ శర్మ బౌలింగ్ ఆడటం ఎంత కష్టమో మనకు తెలిసిందే. ఇక ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన అతి కొద్ది మంది భారత బౌలర్లలో సందీప్ శర్మ ఒకడు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న బౌలర్ల కంటే ఐపీఎల్ లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు సందీప్ శర్మ.
అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ సందీప్ శర్మకు టీమిండియా నుంచి అవకాశాలు రాలేదు. కేవలం రెండు టీ20 ఛాన్స్ లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు సెలక్టర్లు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. రెండు టీ20 మ్యాచ్ లు ఆడి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 106 మ్యాచ్ ల్లో 116 వికెట్లు పడగొట్టాడు. టీ20 స్పెషలిస్ట్ గా ముద్ర పడిన బుమ్రా కంటే ముందుగానే ఐపీఎల్ లో వంద వికెట్లు తీశాడు సందీప్ శర్మ. అయినప్పటికీ అతడికి టీమిండియా నుంచి అవకాశాలు రాలేదు. అదీకాక ఈ ఐపీఎల్ వేలంలో సందీప్ శర్మను ఏ ఫ్రాంచైజీ కోనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ప్రసీద్ద్ కృష్ణ గాయంతో వైదొలగడంతో.. అతడి ప్లేస్ లో రాజస్థాన్ సందీప్ శర్మను తీసుకుంది. ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ టీమిండియా క్రికెట్ లో ఓ అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు సందీప్ శర్మ. మరి సందీప్ శర్మ లాంటి అండర్ రేటెడ్ ఆటగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.