సందీప్ శర్మ విలన్ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. సన్ రైజర్స్ పై నో బాల్ వేసినందుకు కాదు. ఆ ఒక్క తప్పు చేసినందుకు నెటిజన్స్ ఇలా అంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ అంతే బాస్. అప్పటివరకు హీరో అని తెగ పొగిడేస్తాం. ఆకాశానికెత్తేస్తాం. అలాంటోడిని విధి.. ఒక్క బంతికే విలన్ ని చేసి పడేస్తుంది. ఈ టోర్నీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. సందీప్ శర్మనే తీసుకోండి. పది సీజన్ల అనుభమున్న బౌలర్. అనుకోకుండా ఛాన్స్ వస్తే రాజస్థాన్ జట్టు తరఫున ఈసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. రీసెంట్ గా కొన్నిరోజుల ముందు ఓ మ్యాచ్ లో చివరి బంతికి అద్భుతంగా బౌలింగ్ చేసి హీరో అయ్యాడు. ఇప్పుడు అదే సందీప్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తో విలన్ అయిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది? హీరో కాస్త విలన్ ఎందుకయ్యాడు?
అసలు విషయానికొస్తే.. సందీప్ శర్మ గురించి ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా ఎక్స్ పీరియెన్స్ ఉన్న బౌలర్ కాబట్టి సీనియర్ క్రికెటర్లని తన బౌలింగ్ తో తికమకపెడుతుంటాడు. అలాంటిది తాజాగా సన్ రైజర్స్ మ్యాచ్ లో తేలిపోయాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన స్థితిలో నో బాల్ వేశాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్ కి సిక్స్ ఇచ్చేశాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి కారణమయ్యాడు. కాస్త వెనక్కి వెళ్తే.. అంటే సరిగా నెల రోజుల ముందు చెన్నైతో మ్యాచ్ లో ఇలాంటి పరిస్థితే వచ్చింది. సీఎస్కేకి చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో సందీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవతల ఉన్నది ధోనీ అయినా సరే రన్స్ కొట్టకుండా అడ్డుకుని రాజస్థాన్ ని గెలిపించాడు.
ఆ రోజు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అడ్డుకున్న సందీప్ శర్మని అందరూ హీరో అన్నారు. ధోనీని అడ్డుకున్నాడని తెగ మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే సందీప్ శర్మ.. సన్ రైజర్స్ పై చివరి బంతికి నో బాల్ వేసి, రాజస్థాన్ రాయల్స్ కు విలన్ అయిపోయాడు. ఇదిలా ఉండగా జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 214/2 స్కోరు చేసింది. దీంతో చాలామంది సన్ రైజర్స్ ఓడిపోవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ అనుహ్యంగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. ఓవర్లన్నీ పూర్తి చేసి 217/6 స్కోరు కొట్టింది. సన్ రైజర్స్ గెలిచిందంటే ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. అదిదీ సర్ ప్రైజ్ అనమాట. సరే ఇదంతా పక్కనబెడితే సన్ రైజర్స్ దెబ్బకు సందీప్ విలన్ అయిపోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Scoring 5 runs in 1 ball against sandeep sharma ain’t for everyone
Well played Samad 😍😍🔥🔥 pic.twitter.com/Ji7kV38oDw
— M. (@IconicKohIi) May 7, 2023