Sandeep Sharma: సాధారణంగా చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత అనుభవం ఉన్న బౌలర్ కైనా ఒత్తిడి ఉంటుంది. ఇక పెద్దగా అంచనాలు లేని సందీప్ శర్మ ధోనిని నిలువరించాలంటే అది శక్తికి మించిన పని. కానీ ఎవ్వరు ఊహించని విధంగా సందీప్ శర్మ రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తో ఇప్పటికే సంతోషంలో మునిగిపోయిన సందీప్‌కు తన కూతురి మరింత సంతోషాన్ని ఇచ్చింది.
చివరి ఓవర్లో 21 పరుగులను డిఫెండ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ టీమ్ గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సందీప్ శర్మ మాత్రం తడబడ్డాడు. దానికి కారణం అతని ముందుంది ఆల్ టైం బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని. ఒత్తిడిలో రెండు వైడ్ బాల్స్, ఒక డాట్ బాల్, ఆ తర్వాత రెండు బంతులకి సిక్సర్లు. దీంతో 6 బంతుల్లో 21 పరుగుల సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులకి వచ్చేసింది. క్రీజ్‌లో ధోని.. ఒత్తిడిలో సందీప్ శర్మ.. హోమ్ గ్రౌండ్ అయ్యేసరికి సపోర్ట్ అంతా చెన్నై వైపే. ఈ దశలో రాజస్థాన్ గెలవాలంటే కష్టమే అనుకున్నారు. కానీ సందీప్ మెరిశాడు. చివరి మూడు బంతులకి సింగిల్స్ మాత్రమే ఇచ్చి చెన్నై విజయాన్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ వేసిన యార్కర్ కి ధోని దగ్గర సమాధానం లేకుండాపోయింది. ఓ వైపు రాజస్థాన్ టీమ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు సందీప్ శర్మ భార్య, కూతురు టీవీలో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
సాధారణంగా చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత అనుభవం ఉన్న బౌలర్ కైనా ఒత్తిడి ఉంటుంది. ఇక పెద్దగా అంచనాలు లేని సందీప్ శర్మ ధోనిని నిలువరించాలంటే అది శక్తికి మించిన పని. కానీ ఎవ్వరు ఊహించని విధంగా సందీప్ శర్మ రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ ని తన భార్య, కూతురు టీవీలో వీక్షించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కనీసం సంవత్సరం వయసు కూడా లేని సందీప్ శర్మ పాప నవ్వుతూ తన తండ్రి బౌలింగ్ చూడడం ముచ్చట గొలిపేలా ఉంది. ఈ వీడియోలో ఆ చిన్నారికి ఏమి అర్ధం కాకపోయినా.. చూస్తూ ఉంటే సందీప్ శర్మని సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ వీడియో చూసి.. సందీప్ శర్మ సైతం హార్ట్ ఇమేజ్‌తో రిప్లై ఇచ్చాడు.
ఇక చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ పై 3 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో బట్లర్ అర్ధ సెంచరీ చేయగా.. మిగిలిన వారందరు తలో చేయి వేశారు. ఇక లక్ష్య ఛేదనలో కాన్వే, రహానే రాణించిన మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 115 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ధోని, జడేజా వీరోచిత పోరాటంతో చివరి బంతి వరకు మ్యాచ్ ని తీసుకొని వచ్చినా.. విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో చెన్నై గ్రౌండ్ లో రాజస్థాన్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. మొత్తానికి చివరి ఓవర్ వేసిన సందీప్ హీరోగా మారితే.. సందీప్ కూతురు ఈ మ్యాచ్ ను టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తూ హైలెట్ గా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Sandeep Sharma’s newborn watching his final-over heroics against CSK ❤️
(via intoxicatingtash/IG) pic.twitter.com/14qSXjNi9g
— ESPNcricinfo (@ESPNcricinfo) April 13, 2023