ఇటీవల ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో అందర్నీ పలకరించనుంది. అదే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలసి చేస్తున్న ‘ఖుషీ’ మూవీ.
విరాట్ కోహ్లీని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. భారత క్రికెట్ అభిమానులతో పాటు విదేశాల్లోనూ చాలా మంది ప్రేక్షకులు అతడ్ని ఆరాధిస్తారు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు కోహ్లీ. గ్రౌండ్లో అతడు చూపించే దూకుడు, గెలిచే వరకు పట్టువదలకుండా పోరాడే తత్వం చాలా మందికి అతడ్ని దగ్గరకు చేసింది. ఆటతో పాటు సామాజిక సేవ ద్వారా కూడా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు విరాట్. సామాన్యులే కాదు చాలా మంది సెలబ్రిటీలకు కోహ్లీ ఫేవరెట్ క్రికెటర్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా అతడంటే వల్లమాలిన అభిమానం. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది.
విజయ్ దేవరకొండ, సమంత కలసి యాక్ట్ చేస్తున్న కొత్త మూవీ ‘ఖుషి’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఒక పాట రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్, సమంత కలసి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సందడి చేశారు. ఇందులో భాగంగా క్రికెట్ మీద తమకు ఉన్న ఇష్టాన్ని వాళ్లు వెల్లడించారు. ఎంఎస్ ధోని తన ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పిన సమంత.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటే ఇష్టమని చెప్పింది. అయితే విరాట్ కోహ్లీని పలు విషయాల్లో తాను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు కోహ్లీ ఫామ్ కోల్పోయాడని.. కానీ అతడు క్రికెట్ ఆడటం ఆపలేదని సమంత పేర్కొంది. సెంచరీ కొట్టే వరకు ఆడుతున్నాడని.. కమ్బ్యాక్లో అతడు సెంచరీ కొట్టినప్పుడు తాను ఏడ్చేశానని చెప్పుకొచ్చింది.
Samantha Prabhu said “Virat Kohli is an inspiration, I almost cried when he made the comeback & scored the hundred”. [Star] pic.twitter.com/U1aDFYbtlT
— Johns. (@CricCrazyJohns) May 12, 2023
Amid the rivalries, watch the cast of #Kushi, @Samanthaprabhu2 & @TheDeverakonda play a round of cricket charades How many did you guess? 🤩
Tune-in to #JindalPanther #CricketLIVE every weekday 6:30 PM & weekend 2:30 PM | Star Sports Network#RivalryWeek #JoinTheGame #IPLonStar pic.twitter.com/lHqXr33A6j
— Star Sports (@StarSportsIndia) May 10, 2023