IPL 2023లో భాగంగా గురువారం పంజాబ్-గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పంజాబ్ ప్లేయర్ సామ్ కర్రన్ ప్రియురాలు. అతడు బౌలింగ్ చేసినప్పుడుల్లా ఎంతో సంతోషంతో చిందులు వేసింది ఈ ముద్దుగుమ్మ.
ఐపీఎల్ 2023 అభిమానులను అలరిస్తూ.. జోరుగా దూసుకెళ్తోంది. ఐపీఎల్ ప్రారంభం అయ్యి కొద్దిరోజులే అవుతున్నప్పటికీ క్రికెట్ లవర్స్ కు ఎక్కడాలేని మజాను అందిస్తోంది. ప్రతీ మ్యాచ్ నరాలుతెగే ఉత్కంఠతకు గురిచేస్తోంది. తాజాగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ అమ్మాయి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పంజాబ్ జట్టును సపోర్ట్ చేస్తూ.. ఆ జట్టు వికెట్ తీసిన ప్రతీసారి, సిక్స్ లు, ఫోర్లు కొట్టినప్పుడల్లా ఎంతో ఉత్సాహంతో చిందులు వేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పంజాబ్ టీమ్ స్టార్ ప్లేయర్, ఐపీఎల్ 2023 సీజన్ కాస్ల్టీ ప్లేయర్ సామ్ కర్రన్ లవర్. ఆమె పేరు ఇసాబెల్లా సైమండ్స్ విల్మోట్. ఈ మ్యాచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ జంట గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సామ్ కర్రన్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో స్టార్ ఆల్ రౌండర్ గా తక్కువ కాలంలోనే గుర్తింపు పొందాడు. ఇక తన బౌలింగ్, బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ కు టీ20 ప్రపంచ కప్ ను అందించాడు. దాంతో ఐపీఎల్ మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఇక సామ్ కర్రన్ విజయాల వెనుక ఓ అమ్మాయి ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ అమ్మాయి పేరు ఇసాబెల్లా సైమండ్స్. ఇక సామ్ కర్రన్-ఇసాబెల్లా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక కర్రన్ ఎక్కడ మ్యాచ్ లు ఆడినా గానీ అక్కడికి వచ్చి అతడిని ప్రోత్సహిస్తుంటుంది ఈ ముద్దగుమ్మ. 2019 ఐపీఎల్ సీజన్ లో సైతం ఈ భామ మ్యాచ్ లు చూడ్డానికి వచ్చింది. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లోనూ తళుక్కున మెరిసింది.
గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇసాబెల్లా. కెమెరామెన్ సైతం ఆమెను పదేపదే చూపిస్తూ.. హైలెట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కర్రన్ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ ఓవర్ లో శుభ్ మన్ గిల్ ను బౌల్డ్ చేయగానే ఇసాబెల్లా సంతోషంతో చిందులేసింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పంజాబ్-గుజరాత్ మ్యాచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం ఇసాబెల్లా అనే చెప్పాలి. ఈ జంట ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సమయం చిక్కినప్పుడల్లా వెకేషన్స్ కు వెళ్తూ.. అక్కడి ఫొటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్ ఆడుతుంటే.. వారి భార్య, పిల్లలు మ్యాచ్ లు చూడ్డానికి వస్తారు. మ్యాచ్ కు వచ్చి వారిని ప్రోత్సహిస్తుంటారు. తాజాగా కర్రన్ ప్రియురాలు ఇసాబెల్లా వచ్చి అతడిని ఉత్సాహపరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఆ అమ్మాయి ఎవరు? అంటూ వెతకడం స్టార్ట్ చేశారు నెటిజన్స్.
Imagine being the highest paid IPL player of the year and this girl as your girlfriend, SAM CURRAN won at life pic.twitter.com/mYoUzADNDu
— Aakash Chopra (@Aakash_Vani_1) April 13, 2023