ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లు అన్నింటిలోకెల్లా ఆ మ్యాచే తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మరి 16 సీజన్లలో సచిన్ ఫేవరెట్ మ్యాచ్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL.. గత 15 సీజన్లుగా అభిమానులను అలరించి.. 16వ సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ మెగాటోర్నీ. ఈ సీజన్ లో కూడా క్రికెట్ లవర్స్ కు మజాను పంచుతూ.. ముందుకుదూసుకెళ్తోంది. 2023 సీజన్ లో జరిగే ప్రతి మ్యాచ్ నరాలుతెగే ఉత్కంఠతతో జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లు అన్నింటిలోకెల్లా ఆ మ్యాచే తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. మరి 16 సీజన్లలో సచిన్ మనసు దోచిన ఫేవరెట్ మ్యాచ్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 16 సంవత్సరాల వయసులోనే బ్యాట్ పట్టుకుని వరల్డ్ క్రికెట్ ను శాసించాడు. ఇక సచిన్ ఏ ఫార్మాట్ లో అడుగుపెట్టినా గానీ దాంట్లో తనదైన ముద్రను క్రియేట్ చేస్తాడు. ఐపీఎల్ లో కూడా తనదైన ముద్రను వేశాడు సచిన్. ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఎన్నో అద్భతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే తాజాగా ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడిన సచిన్ టెండుల్కర్ ఐపీఎల్ చరిత్రలో తన ఫేవరెట్ మ్యాచ్ ఏదో వెల్లడించాడు. 2017లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన ఫేవరెట్ అని చెప్పాడు మాస్టర్ బ్లాస్టర్.
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రైజింగ్ పుణే సుపర్ జైయింట్స్ తో తలపడింది. ముంబై జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించగా.. పుణేకు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కృనాల్ పాండ్యా 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రత్యర్థి లక్ష్యం తక్కువే కావడంతో ముంబై ఓటమి ఖాయం అనుకున్నారు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన పుణే జట్టు ముంబై బౌలర్ల ధాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఒక్క పరుగుతో ఓటమి పాలైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (51) పరుగులతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
ఇక పూణే జట్టులో రహానే, త్రిపాఠి, ధోని ఉన్నప్పటికీ జట్టుకు ఐపీఎల్ టైటిల్ ను అందించలేకపోయారు. ఇక నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ ను ఐపీఎల్ లో తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు సచిన్ టెండుల్కర్. అదీకాక క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను పంచింది ఈ గేమ్. ఒత్తిడిని తట్టుకుని ముంబై జట్టు సాధించిన విజయం నా జీవితంలో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్. మరి ఐపీఎల్ చరిత్రలో మీకు నచ్చిన మ్యాచ్ ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar shares his favourite moment in IPL history.#Cricket #CricketNews #CricketTwitter #MumbaiIndians #SachinTendulkar #IPL #IPL2023 pic.twitter.com/6V5bz8P4jH
— CricInformer (@CricInformer) April 21, 2023