రుతురాజ్ గైక్వాడ్.. గత రంజీ సీజన్లో దుమ్మురేపాడు. వరుసగా సెంచరీలు సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అదే ఫామ్ ను ఐపీఎల్ లో సైతం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే టీమిండియా దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు రుతురాజ్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ క్రికెట్ జాతర అట్టహాసంగా శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఇక ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడి అందరిని ఆకట్టుకున్నాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.రుతురాజ్ ఊపు చూస్తే.. సెంచరీ చేస్తాడనే అనుకున్నారంత. ఈక్రమంలోనే టీమిండియా దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు రుతురాజ్.
రుతురాజ్ గైక్వాడ్.. గత రంజీ సీజన్లో దుమ్మురేపాడు. వరుసగా సెంచరీలు సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అదే ఫామ్ ను ఐపీఎల్ లో సైతం కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 92 పరుగులు చేసిన రుతురాజ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే? ఐపీఎల్ లో 37 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా రుతురాజ్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 37 ఐపీఎల్ ఇన్నింగ్స్ లలో 1271 పరుగులు చేయగా.. రుతురాజ్ 37 మ్యాచ్ ల్లో 1299 పరుగులు సాధించి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు.
ఇక ఈ జాబితాలో రిషబ్ పంత్ 1184 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జట్టులో రుతురాజ్ (92), మెుయిన్ అలీ (23) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, జోసెఫ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 63 పరుగులతో రాణించాడు.
Ruturaj Gaikwad breaks Sachin Tendulkar’s record in IPL https://t.co/CtYvvvs2wY
— Crictoday (@crictoday) April 1, 2023