ఐపీఎల్ రూల్స్ ని అతిక్రమించినందుకు గాను విరాట్ కోహ్లీ, గంభీర్ కి భారీగా జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ ఫీజు కోహ్లీ చెల్లించడం లేదని సమాచారం. మరి కోహ్లీ చెల్లించకపోతే ఎవరు చెల్లిస్తారు?
ఐపీఎల్ లో భాగంగా మే 1 న లక్నో సూపర్ జయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఆ రోజు పెద్ద గొడవ చోటు చేసుకోవడం ఐపీఎల్ లో సంచలనంగా మారింది. మొదట ఈ వివాదం భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ పేసర్ మధ్య జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా .. ఆ తర్వాత అసలు యుద్ధం స్టార్ట్ అయింది. ఇదే విషయమై కోహ్లీ.. మేయర్స్ తో మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి తీసుకెళ్లాడు. దీంతో కాస్త సహనం కోల్పోయిన కోహ్లీ గంభీర్ తో ఈ విషయమై అడుగుతుండగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం క్రమంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రూల్స్ ని అతిక్రమించినందుకు గాను వీరిద్దరికి భారీగా జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ ఫీజు కోహ్లీ చెల్లించడం లేదని సమాచారం. మరి కోహ్లీ చెల్లించకపోతే ఎవరు చెల్లిస్తారు?
ఐపీఎల్ లో కోహ్లీ జీతం ఏడాదికి 15 కోట్లు. కనీసం 14 మ్యాచులు ఆడతారు కాబట్టి ఈ లెక్కన ఒక మ్యాచుకు దాదాపు కోటి 7 లక్షలు అందుకుంటున్నాడు. అయితే కోహ్లీ మ్యాచ్ ఫీజు లో బీసీసీఐ ఇప్పుడు 100 శాతం జరిమానా విధించడంతో ఈ మొత్తం అమౌంట్ కట్ చేసి మిగిలిన మొత్తాన్ని కోహ్లీకి ఇస్తారు. ఏ ఆటగాడికైనా ఇదే రూల్ వర్తిస్తుంది. కానీ స్లో ఓవర్ రేట్ కింద విధించిన జరిమానా మాత్రం ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది. ఆటగాళ్ల జీతంలో ఎటువంటి కోత ఉండదు. అయితే ఇప్పుడు కోహ్లీ చెల్లించాల్సిన కోటి రూపాయాలు స్వయంగా బెంగళూరు ఫ్రాంచైజీని చెల్లుస్తుందని తెలిపింది. దీంతో ఇప్పుడు కోహ్లీకి రూపాయి ఖర్చులేకుండా పోయింది. చాలా సందర్భాల్లో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జరిమానాను భరిస్తారు. ఈ లెక్కన గంభీర్ మ్యాచ్ ఫీజు 25 లక్షల రూపాయలను కూడా లక్నో ఫ్రాంచైజీ భరిస్తుందో లేదో చూడాలి. మొత్తానికి కోహ్లీ కోసం ఫ్రాంచైజీలు తీసుకున్న గొప్ప నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి .