సాధారణంగా స్టార్ క్రికెటర్లు వారి అభిమానులని సంతోష పెట్టాలని కోరుకుంటారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించాడు. పుట్టిన రోజు అభిమానిని కాస్త కంగారు పెట్టి ఆటపట్టించాడు.
ఐపీఎల్ లో నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో ఈ మ్యాచ్ 1000 వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. మరొకటేమో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు. ఈ రెండు విశేషాల సందర్భంగా నిన్న ముంబైలోని వాంఖడేలో సందడి వాతావరణం నెలకొంది. దానికి తగ్గట్లే వేడుకలు భారీగా నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్ కెప్టెన్ గా రోహిత్ కి 150 వది కావడం విశేషం. మొదట్లో 1000 మ్యాచ్ పురస్కరించుకొని దిగ్గజ క్రికెటర్లకు మెమోలు అందజేయగా మ్యాచ్ అనంతరం రోహిత్ పుట్టిన రోజు గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉండగా.. నిన్న రోహిత్ అభిమానిని కాస్త కంగారు పెట్టాడు.
సాధారణంగా స్టార్ క్రికెటర్లు వారి అభిమానులని సంతోష పెట్టాలని కోరుకుంటారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం పెవిలియన్ కి వెళ్తున్న రోహిత్ ని అభిమానులు సెల్ఫీ అంటూ గోల పెట్టారు. దీంతో అందరికీ సెల్ఫీ ఇచ్చే క్రమంలో ఒక అభిమాని ఫోన్ తీసుకొని వెళ్తుండడంతో అభిమాని రోహిత్ భయ్యా మేరె ఫోన్ అంటూ కంగారు పడ్డాడు. దీంతో రోహిత్ నవ్వుకుంటూ అతని ఫోన్ అతనికి ఇచ్చేసాడు. ఇదంతా రోహిత్ కావాలనే చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచులో రాజస్థాన్ భారీ స్కోర్ కొట్టినా.. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అందరు సమిష్టిగా పోరాడి కెప్టెన్ రోహిత్ శర్మ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత హిట్ మ్యాన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మొత్తానికి పుట్టిన రోజు నాడు రోహిత్ తన అభిమానిని సరదాగా ఆటపట్టించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.