ఐపీఎల్ లో భాగంగా మరి కొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ ని ఒక విషయం కలవరపెడుతుంది.
ఐపీఎల్ లో భాగంగా మరి కొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో జట్టులో మేయర్స్, అవేశ్ ఖాన్ ప్లేస్ లో దీపక్ హుడా, నవీన్ ఉల్ హక్ ఎంట్రీ ఇవ్వగా.. ముంబై ఒక్క మార్పుతో జట్టులో హృతిక్ షోకీన్ న్నీ తీసుకొచ్చింది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ ని ఒక విషయం కలవరపెడుతుంది. మరి ఆ రికార్డ్ ఏంటి?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ప్రస్తుత సీజన్లలో తన చెత్త ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై 12 మ్యాచులు ఆడగా.. రోహిత్ బ్యాట్ నుంచి కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే వచ్చింది. డకౌట్లతో పాటుగా..చాలా సింగల్ డిజిట్ స్కోర్లని నమోదు చేసాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ ఇప్పుడు ఆ జట్టుని ఆందోళనకు గురి చేస్తుంది. అసలే ఫామ్ లేమితో సతమవుతున్న హిట్ మ్యాన్ కి లక్నో బౌలర్ అమిత్ మిశ్రా రికార్డ్ రోహిత్ అభిమానులని కంగారు పెడుతుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు రోహిత్ శర్మ మిశ్రా బౌలింగ్ లో 7 సార్లు ఔటవ్వడం గమనార్హం.
మిశ్రా బౌలింగ్ లో 91 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం 87 పరుగులు మాత్రమే చేసాడు. స్ట్రైక్ రేట్ 100 కూడా లేదు. యావరేజ్ కేవలం 12 మాత్రమే ఉండగా.. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సులు మాత్రమే ఉన్నాయి. ఇదివరకు జరిగిన మ్యాచులో అప్పటివరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో చెత్త రికార్డ్ ఉన్న రోహిత్..మ్యాచులో కూడా అతడికే వికెట్ ని సమర్పించుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచులో కూడా మిశ్రా.. హిట్ మ్యాన్ వికెట్ తీసి ఆధిపత్యం చెలాయిస్తాడో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.