ఐపీఎల్ లో సూర్య సెంచరీ కొట్టాడు. కేక పుట్టించే బ్యాటింగ్ చేశాడు. కానీ దీనికి రోహిత్ శర్మకు సంబంధం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఏంటి విషయం?
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ లోని వన్ ఆఫ్ ది తోపు ప్లేయర్. దేశవాళీల్లో ఆడినప్పటికీ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అలా కేక పుట్టించే ఇన్నింగ్స్ లతో టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసారి ఐపీఎల్ లో మొదట్లో సూర్య చాలా ఘోరంగా ఆడాడు. కొన్ని ఇన్నింగ్స్ ల తర్వాత సెట్ అయిపోయాడు. తాజాగా గుజరాత్ మ్యాచ్ లో ఏకంగా అదిరిపోయే బ్యాటింగ్ తో సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ కెరీర్ లో సూర్యకు ఇది ఫస్ట్ శతకం. అందరూ అద్భుతమైన సెంచరీ అని మెచ్చుకుంటున్నారు. అయితే దీనితో కెప్టెన్ రోహిత్ శర్మకు లింక్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
అసలు విషయానికొచ్చేస్తే.. ఐపీఎల్ లో టాప్ టీమ్ అంటే ఆల్మోస్ట్ చాలామంది చెప్పే పేరు ముంబయి ఇండియన్స్. సచిన్, రోహిత్ శర్మ లాంటి వాళ్ల వల్ల కాదు టోర్నీలోని స్టార్ ప్లేయర్స్ ఒకప్పుడు ఈ జట్టులో ఆడారు. అలాంటి టైంలోనే అంటే ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడనే చెప్పాలి. ఎందుకంటే జట్టు స్ట్రాంగ్ గా ఉన్నా దాన్ని నడిపించే నాయకుడు కావాలి కదా! అది రోహిత్ శర్మ ప్రూవ్ చేసి చూపించాడు.
ఐపీఎల్ తొలి మూడు సీజన్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ.. 2012లో ముంబయిలోకి వచ్చాడు. ఆ సీజన్ లో మే 12న ముంబయి తరఫున తొలి ఐపీఎల్ సెంచరీ కొట్టాడు. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి. ఇప్పుడు అదే తేదీన అదే స్థానంలో బ్యాటింగ్ కి దిగిన సూర్యకుమార్.. ముంబయి తరఫున తన తొలి శతకం కొట్టాడు. ఇప్పుడు ఇదికాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. సూర్య అనుకోని కొట్టాడా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది పక్కనబెడితే ఒకేతేదీలో రోహిత్-సూర్య సెంచరీలు కొట్టడం ముంబయికి చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా గుజరాత్ తో మ్యాచ్ లో ముంబయి 27 పరుగుల తేడాతో విజయం సాధించుకుంది. ప్లే ఆఫ్స్ ఛాన్సుల్ని మెరుగుపరుచుకుంది. మరి సూర్య-రోహిత్ ఒకేరోజు సెంచరీలు బాదడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.