రోహిత్ శర్మ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలవగా..అన్ని టైటిల్స్ కూడా రోహిత్ కెప్టెన్సీలోనే వచ్చాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ ఒకటి ఫ్యాన్స్ ని భయపెడుతుంది.
ఐపీఎల్ లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. మరి కాసేపట్లో జరుగనున్న ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలబడుతున్నాయి. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ కానుండడంతో ఓడిపోయిన టీంకి మరో అవకాశం ఉండదు. దీంతో టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టైటిల్ రేస్ లో ఉండాలంటే ఇరు జట్లు కూడా తమ శక్తికి మించి ఆడాల్సి ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ స్థాయిలో 10 వ సారి ఐపీఎల్ ఫైనల్ కి దూసుకెళ్ళగా.. ఈ రోజు గెలిచిన జట్టు గుజరాత్ మీద క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ ఒకటి ఫ్యాన్స్ ని భయపెడుతుంది.
రోహిత్ శర్మ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలవగా..అన్ని టైటిల్స్ కూడా రోహిత్ కెప్టెన్సీలోనే వచ్చాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హిట్ మ్యాన్. అయితే ప్లే ఆఫ్ ముందు మాత్రం ఒక రికార్డ్ ముంబై ఇండియన్స్ అభిమానులని ఆందోళనకు గురి చేస్తుంది. దానికి కారణం రోహిత్ శర్మ ప్లే ఆఫ్ రికార్డ్ అందరికంటే దారుణంగా ఉండడమే. 19 ప్లే ఆఫ్ మ్యాచులు ఆడిన రోహిత్ కేవలం 297 పరుగులు మాత్రమే చేసాడు.
యావరేజ్ కేవలం 16 మాత్రమే ఉండగా.. స్ట్రైక్ రేట్ 108 మాత్రమే ఉంది. వీటిలో 2 అర్ధ సెంచరీలు నెలకొల్పగా.. అత్యధిక స్కోర్ 68. అసలే ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్.. ఇప్పుడు ఈ ప్లే ఆఫ్ రికార్డ్ మరింత భయపెడుతుంది. ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న ఈ ముంబై బ్యాటర్.. జట్టుని మాత్రం బాగా నడిపిస్తున్నాడు. మరి కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచులో రోహిత్ ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది. మరి తన సెంటిమెంట్ ని కొనసాగిస్తూ మరోసారి విఫలమవుతాడా లేకపోతే తన చెత్త రికార్డ్ ఉందనే అపవాద తొలగించుకుంటాడా చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.