Tilak Varma: తిలక్ వర్మ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడినా.. తిలక్ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశంసలతో పాటు తిలక్‌కు త్వరలోనే టీమిండియాలో స్థానం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైనా.. ఆ జట్టు యువ క్రికెటర్ తిలక్ వర్మ పేరు మాత్రం మారుమోగిపోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌తోనే తిలక్ టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. అందుకు కారణం అతను చూపిన అద్భుత పోరాటం. ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే సిరాజ్ బౌలింగ్‌లో కిషన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరుసటి ఓవర్‌లో కామెరున్ గ్రీన్‌ను టోప్లీ అవుట్ చేశాడు. పవర్ ప్లేయర్ చివరి ఓవర్‌లో రోహిత్ శర్మ సైతం అవుట్ అవ్వడంతో ముంబై అత్యంత దారుణంగా 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశంలో క్రీజ్‌లోకి వచ్చాడు 22 ఏళ్ల తిలక్ వర్మ.
గతేడాది కనబర్చిన మంచి ప్రదర్శనతో తిలక్ ముంబై జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. అతని ముంబై ఉంచిన నమ్మకాన్ని తొలి మ్యాచ్‌లోనూ నిరూపిస్తూ.. అద్భుతంగా ఆడాడు. ఒక వైపు రోహిత్, ఇషాన్, గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి హేమాహేమీలు పెవిలియన్ చేరినా.. పటిష్టమైన ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొంటూ.. సంచనల ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 48 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన ముంబై.. 171 పరుగుల మంచి స్కోర్ చేసిందంటే అందుకు ఒకే ఒక కారణం తిలక్ వర్మ. అస్సలు ఏ మాత్రం భయం, ఒత్తిడి లేకుండా జట్టును అతను ఆదుకున్న తీరు, షాట్లు ఆడిన విధానం, చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మించి.. మంచి టార్గెట్ ఇవ్వడం చూసి.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ తర్వాత ఓటమి బాధను మర్చిపోయి.. తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపంచాడు. తిలక్ పోరాటం అద్భుతమని, అతనికి హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకున్నాడు. రోహిత్ శర్మ లాంటి క్రికెటర్.. యంగ్ టాలెంట్‌ను ఈ విధంగా పొగడ్తలతో మెచ్చుకోవడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రోహిత్ శర్మ కేవలం ఐపీఎల్ కోణంలో తిలక్ వర్మను చూడటం లేదని, టీమిండియా భవిష్యత్తుగా తిలక్‌ను చూస్తున్నాడని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఇలాంటి మెచ్యూరిటీ ఇన్నింగ్స్ చూసిన తర్వాత.. ప్రస్తుతం టీమిండియాలో ఖాళీగా ఉన్న నాలుగో స్థానంలో తిలక్ వర్మను తీసుకునే ఆలోచనలో రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే, టీ20ల్లో ప్రస్తుతం నాలుగో స్థానం ఖాళీగా ఉంది. సూర్య టీ20ల్లో ఉన్న వన్డేల్లో విఫలం అవుతున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ గాయంతో చాలా కాలం జట్టుకు దూరం కానున్నాడు. దీంతో.. ఐపీఎల్ తర్వాత వన్డే వరల్డ్ కప్ మధ్య ఉన్న గ్యాప్‌లో తిలక్ వర్మకు వన్డేల్లో నాలుగో స్థానంలో అవకాశం ఇచ్చి టెస్ట్ చేయాలని రోహిత్ భావిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి అది జరిగితే మంచి నిర్ణయం అవుతుంది. తిలక్ వేగంగా ఆడటంతో పాటు మంచి పరిణతితో పరిస్థితులకు తగ్గట్లు భాగస్వామ్యాలు సైతం నెలకొల్పగలడు. అందుకే.. వన్డే టీమ్‌లో కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం మెండుగా ఉంది. అలాగే.. అతను ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే రిషభ్ పంత్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ లేని లోటును కూడా తిలక్ వర్మ రూపంలో తీరే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
4 awards for 20-year-old Tilak Varma.
A future Superstar. pic.twitter.com/dlsRrOexMZ
— Johns. (@CricCrazyJohns) April 2, 2023
Big Alert 🚨.
Tilak Varma is the future.. pic.twitter.com/VMfBqP9uKu
— Vishal. (@SPORTYVISHAL) April 2, 2023
Mumbai 20 for 3 in their first match in IPL 2023.
Then 20-year-old, Tilak Varma stands tall & scores a terrific 84* from 46 balls including 9 fours & 4 sixes.
A player to watch out for in the future. pic.twitter.com/1tAnxqVnZC
— Johns. (@CricCrazyJohns) April 2, 2023