ఐపీఎల్ లో చాలా మంది ముంబై ప్లేయర్లు భారత జట్టులో సంపాదించినవారే. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ముంబై ఇండియన్స్ జట్టులో కొంత మంది యంగ్ స్టార్స్ తయారైనట్టుగానే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తమ ప్లేయర్లను పొగుడుతూ స్వార్ధ బుద్ధిని బయటపెట్టాడు.
ఐపీఎల్ లో చాలా మంది ముంబై ప్లేయర్లు భారత జట్టులో సంపాదించినవారే. ఈ లిస్టులో బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ ఉన్నారు. వీరందరూ ఒకప్పుడు ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ప్రదర్శన కారణంగానే జట్టులోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టీంఇండియాలో సగం మంది ముంబై ఇండియన్స్ ప్లేయర్లే ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ముంబై ఇండియన్స్ జట్టులో కొంత మంది యంగ్ స్టార్స్ తయారైనట్టుగానే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తమ ప్లేయర్లను పొగుడుతూ స్వార్ధ బుద్ధిని బయటపెట్టాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫుల్ జోష్ లో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ మీద గెలవడం ద్వారా అదృష్టవశాత్తు ప్లే ఆఫ్ కి వెళ్లిన రోహిత్ సేన ప్రస్తుతం లక్నోతో మ్యాచ్ ఆడుతుంది. టైటిల్ రేస్ లో ఉండాలంటే ఏ ఎలిమిమినేటర్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే ఈ మ్యాచ్ కి ముందు రోహిత్.. తిలక్ వర్మ, నెహ్యాల్ వధేరా ని ఆకాశానికెత్తేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీరిద్దరే ఇండియన్ ఫ్యూచర్ స్టార్స్అని చెప్పేసాడు. ఐపీఎల్ లో ఎంతో మంది బాగా రాణిస్తుంటే రోహిత్ మాత్రం వీరిద్దరి పేర్లే చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది.
ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ అయినంత మాత్రాన..ప్లేయర్లను సపోర్ట్ చేయడంలో అర్ధం ఉంది. కానీ రోహిత్ భారత్ జట్టుకి కూడా కెప్టెన్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఒక జాతీయ జట్టుకి కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత రోహిత్ మీద ఎంతైనా ఉంది. అంతే కాదు భవిష్యత్తులో టీంఇండియా ముంబై ప్లేయర్లతో నిండిపోతుందని జోస్యం చెప్పాడు. మొత్తానికి రోహిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.