తన పుట్టినరోజునాడు ముంబయి మ్యాచ్ గెలిచింది అనే ఆనందం కంటే అతడు ఔటైన తీరు రోహిత్ శర్మకి తెగ బాధపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఔట్ అలాంటిది మరి. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ 1000వ మ్యాచ్. వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ పై ముంబయి గెలిచింది. ఈ మైదానంలోని ఛేదనలో ఏ జట్టుకు సాధ్యం కానీ సరికొత్త రికార్డుని నమోదు చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. కేవలం మూడంటే మూడు పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ సీజన్ లో మిగతా మ్యాచుల్లోనూ ఇలానే ఫెయిలవుతున్నాడు కదా అని అనుకోవచ్చు! కానీ రాజస్థాన్ తో జరిగిన తాజా మ్యాచ్ లో ఔటైన తీరు ఇప్పుడు పాపం అంటే పాపం అనిపించింది. అలానే ఇది కాంట్రవర్సీగానూ మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ల కంటే కాంట్రవర్సీలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక సంఘటన వివాదం అవుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్-ముంబయి మ్యాచ్ లోనూ సేమ్ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 212/7 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం 19.4 ఓవర్లలోనే ముంబయి టార్గెట్ పూర్తి చేసింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకు ఔటయ్యాడు. అయితే దీనిపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఎక్కడలేని డౌట్స్ వస్తున్నాయి. అదే టైంలో ఇది ఔట్ లేదా నాటౌట్ అనే డిస్కషన్ తెగ జరుగుతోంది.
రాజస్థాన్ తో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ 3 పరుగులతో ఉన్న టైంలో.. సందీప్ శర్మ బౌలింగ్ వేశాడు. రెండో ఓవర్ చివరి బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. చెప్పాలంటే రోహిత్ ఔట్ కాలేదని, వికెట్ కీపర్ సంజూ శాంసన్ వేలు తాకడం, అదే టైంలో బంతి బెయిల్స్ ని దాటి వెళ్లడం ఒకేసారి జరిగాయి. దీంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. రోహిత్ అయితే వెనక్కి తిరిగి చూడకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు దీని గురించే తెగ డిస్కషన్ నడుస్తోంది. రోహిత్ ఔట్ కాలేదని క్లారిటీగా తెలుస్తోందని అభిమానులు వీడియోలు షేర్ చేస్తున్నారు. బంతి బెయిల్స్ ని తాకలేదని, సంజూ చేతివేలి కారణంగా బెయిల్ లైటింగ్ వచ్చిందని, అతడు చీట్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటున్నారు. ఇలా పుట్టినరోజు నాడే రోహిత్ ఔట్ కావడం నెక్స్ట్ లెవల్ దురదృష్టం అనే చెప్పాలి. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Is the stump hit Sanju Samson’s glove? or Umpire gave the correct decision against Rohit Sharma? 🤔
📸: Jio Cinema | #MIvRR pic.twitter.com/gZB12tRazh
— CricTracker (@Cricketracker) April 30, 2023