మీరు రోహిత్ శర్మ ఫ్యానా? అయితే ఈ స్టోరీ కచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఐపీఎల్ లో ఐదుసార్లు కప్ కొట్టాడు, కొట్టాడు అని సంబరపడిపోతుంటారు కదా! ఇది చదివితే మీ ఆలోచనే మారిపోయే ఛాన్సుంది.
రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్లేయర్. ఈ టోర్నీలో తొలుత డెక్కన్ ఛార్జర్జ్ కి ఆడాడు. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ తర్వాత ఈ టీమ్ కి కెప్టెన్ అయిపోయాడు. అక్కడి నుంచి అటు బ్యాటర్, ఇటు కెప్టెన్ గా అద్భుతాలు చేశాడు. ఏకంగా ఐదుసార్లు ముంబయిని విజేతగా నిలిపాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీ బ్లాక్ బస్టర్ అని మార్మోగిపోయింది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ సీజన్ లో ముంబయి పడుతూ లేస్తూ ఎందుకు ఆడుతోంది? రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అయితే జట్టుని ముందుండి నడిపించాలి కదా! కానీ అలా జరగడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఒకరు.. రోహిత్ కెప్టెన్సీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
అసలు విషయానికొచ్చేస్తే.. రోహిత్ శర్మ కెప్టెన్ అవడం వల్ల కాదు, ముంబయి జట్టులో పొలార్డ్, హార్దిక్ పాండ్య, బుమ్రా, డికాక్, మలింగ లాంటి అద్భుతమైన ప్లేయర్స్ ఉండటం, వాళ్లంతా కలిసికట్టుగా ఆడటం వల్ల కప్పులు కొట్టింది. ఇందులో రోహిత్ కెప్టెన్సీ కూడా కాస్త పనిచేసి ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే రోహిత్ వల్ల కాదు టీమ్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ వల్ల ఇంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ క్రికెటర్లలో కొందరు రిటైర్ అయిపోయారు. మరికొందరు జట్టు మారిపోయారు. దీంతో ముంబయి బలహీనంగా తయారైంది. సూర్య కుమార్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. ఇలా ఎవరో ఒకరు ఆడితేనే ఈ సీజన్ లో ఆ మ్యాచ్ లో గెలిచేసి మమ అనిపిస్తున్నారు. అటు రోహిత్ బ్యాటింగ్ లో ఫెయిలవుతున్నాడు. కెప్టెన్ గా బౌలర్స్ ని సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ గమనించిన కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ ధుల్ హిట్ మ్యాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎందుకింత హైప్ వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. అతడు మంచి కెప్టెన్ కావొచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు. ఎందుకంటే అతడికి బెస్ట్ టీమ్ దొరికింది. టైటిల్స్ గెలిచాడు. గత సీజన్ నుంచి రోహిత్ శర్మకు ఏం అర్థం కావడం లేదు. కెప్టెన్ గా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్ లోనే కాదు ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ లోనూ కెప్టెన్ గా ఫెయిలయ్యాడు. ఈ సీజన్ లోనూ రోహిత్ కెప్టెన్సీ అలానే ఉంది. ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ తో ఫ్లే ఆఫ్స్ చేరడం కష్టమే’ అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్ చెప్పుకొచ్చాడు. మరి ఈయన చెప్పింది విన్న తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.