ముంబయి మ్యాచ్ గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మర్చిపోలేని చెత్త రికార్డు వచ్చి చేరింది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి ఇండియన్స్.. ఈ పేరుకి ఐపీఎల్ పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే ఒకటి, రెండు కాదు ఇప్పటివరకు ఏకంగా 5 కప్పులు కొట్టింది. ఆరోసారి విజేతగా ఎప్పుడు నిలుస్తుందా అని ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్. అందుకు తగ్గట్లు ఈ సీజన్ పడుతూ లేస్తూ మ్యాచ్ లు ఆడుతోంది. వరసగా రెండు మ్యాచుల్లో గెలిచి కాస్త ఫామ్ లోకి వచ్చిన ముంబయి.. ఫ్యాన్స్ కి ఫుల్ ఊపు ఇచ్చింది. తాజాగా పంజాబ్ పై గెలిచి రివేంజ్ తీర్చుకున్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అనవసరమైన చెత్త రికార్డు వచ్చి చేరింది. ఇప్పుడదే హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ని తెగ ఇబ్బంది పెడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ శర్మ అంటే ప్రత్యర్థి బౌలర్లు అందరూ భయపడిపోయేవాళ్లు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ అలా చేసేవాడు. కానీ ఈ సీజన్ లో ఎందుకో పస తగ్గినట్లు కనిపిస్తుంది. టీమిండియా కెప్టెన్సీ చేస్తుండటం వల్లనో ఏమో గానీ బ్యాటింగ్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు కనిపిస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లాడిన రోహిత్.. 1, 21, 65, 20, 28, 44, 2, 3, 0 పరుగులు చేశాడు. తాజాగా పంజాబ్ తో మ్యాచ్ లో మరీ ఘొరంగా డకౌట్ అయ్యాడు. ఈసారి ఐపీఎల్ రోహిత్ శర్మకు ఇదే ఫస్ట్ డకౌట్. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఐపీఎల్ లో 15సార్లు డకౌట్ అయ్యాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ తో పాటు మన్ దీప్ సింగ్, దినేష్ కార్తిక్, సునీల్ నరైన్.. చెరో 15 డకౌట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ పై మ్యాచ్ గెలిచాం అనే ఆనందం కంటే.. హిట్ మ్యాన్ ఖాతాలో ఏ కెప్టెన్ కి లేని వరస్ట్ రికార్డ్ నమోదు కావడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు మ్యాచ్ లు గెలుస్తున్నాం అనే ఆనందం కంటే.. రోహిత్ అనవసర రికార్డులు క్రియేట్ చేస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.