ఐపీఎల్ మొదలవడానికి ముందే రోహిత్ శర్మ మిస్సయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. కెప్టెన్స్ ఫొటోషూట్ లో అందరూ ఉన్నారు ఒక్క రోహిత్ తప్ప. ఇంతకీ అతడికి ఏమైంది?
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ కు ఎందుకో అంతగా క్రేజ్ కనిపించట్లేదు. బహుశా మ్యాచులు స్టార్ట్ అయితే ఏమైనా వస్తుందేమో చూడాలి. ఈసారి కూడా ఎప్పటిలానే చెన్నై, ముంబయి జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ పైనా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్లతోపాటు మిగతా జట్లు కూడా కప్ కొట్టేయాలని ఫుల్ కసిగా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ ప్రారంభానికి ఓరోజు ముందు కెప్టెన్స్ అందరూ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ ఫొటోల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో కొత్త డౌట్స్ వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఏమైందా అని ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి ఇండియన్స్ అంటే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది రోహిత్ శర్మనే. ఎందుకంటే ఏకంగా ఐదుసార్లు కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రతి సీజన్ లో ఈ జట్టుకి ఫ్యాన్స్ పెరుగుతున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రోహిత్. కానీ ఈ సీజన్ లో మాత్రం కొన్ని మ్యాచులకు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీనిలో భాగంగానే తను ఆడని మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని కూడా భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కెప్టెన్స్ ఫొటో షూట్ లోనూ కనిపించడకపోవడంతో లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. ఏమైనా గాయాలు అయ్యాయా అని మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు ఐపీఎల్ తర్వాత కొన్ని నెలల్లో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ కూడా జరగనుంది. ఈ రెండు టోర్నీల కోసమని రోహిత్ ఐపీఎల్ మ్యాచుల నుంచి విశ్రాంతి తీసుకోవడం కరెక్టే కానీ మరీ ఫొటోషూట్ లో పాల్గొనంత బిజీగా ఏం చేస్తున్నాడా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరికొందరైతే.. ఈ ఫొటో తీసింది రోహిత్ శర్మనే అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముంబయి ఫ్యాన్స్ అయితే ఫొటోది ఏముంది గత సీజన్ లో జరిగింది ఏదో జరిగింది గానీ ఈసారి మాత్రం కప్ మాదే అని ఫుల్ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్.. ఏప్రిల్ 1న బెంగళూరుతో జరగనుంది. ఏదేమైనా సరే రోహిత్ డుమ్మా కొట్టడం మాత్రం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Game Face 🔛
ARE. YOU. READY for #TATAIPL 2023❓ pic.twitter.com/eS5rXAavTK
— IndianPremierLeague (@IPL) March 30, 2023