ప్లేఆఫ్స్‌కు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ మంచి విజయాన్ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సూపర్బ్ విక్టరీతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం చెలరేగుతోంది.
ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ముంబై ఇండియన్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ సంధించిన 200 రన్స్ భారీ టార్గెట్‌ను 16.3 ఓవర్లలోనే ఛేజ్ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (1) మరోసారి ఫెయిల్ అయ్యాడు. కానీ వీర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (41 బాల్స్‌లో 65), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33 బాల్స్‌లో 68) ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (18 బాల్స్‌లో 30) కూడా అటాకింగ్‌కు దిగడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది.
ఛేదనకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ (7) మరోసారి తక్కువ స్కోరుకే ఔటై ఫ్యాన్స్‌ను నిరాశపర్చాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (21 బాల్స్‌లో 42)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (35 బాల్స్‌లో 83), నెహాల్ వధేరా (34 బాల్స్‌లో 52) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ముఖ్యంగా సూర్యకుమార్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే సూర్య ఏవిధంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అతడి బ్యాటింగ్ ఊచకోతకు ఆర్సీబీ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సందర్భంగా ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ అవుట్‌పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. వనిందు హసరంగ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చిన ఆడిన రోహిత్ ఆ బాల్‌ను మిస్ చేశాడు. అది కాస్తా హిట్‌మ్యాన్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో ఎల్బీడబ్ల్యూ కోసం ఆర్సీబీ ప్లేయర్స్ అప్పీల్ చేశారు. అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్లు మాత్రం అది నాటౌట్ అని ఇచ్చారు. డుప్లెసిస్ డీఆర్ఎస్కు వెళ్లాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బాల్ రోహిత్ బ్యాట్‌కు తగల్లేదని తేలింది. అయితే బాల్ ట్రాకింగ్‌లో మాత్రం వికెట్లకు తగులుతున్నట్లు తేలింది.
బాల్ ట్రాకింగ్‌లో వికెట్లకు తగులుతున్నట్లు తేలడంతో రోహిత్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ఇచ్చారు. ఇప్పుడిదే కాంట్రవర్సీగా మారింది. త్రీ మీటర్ రూల్ ప్రకారం ఇది నాటౌట్ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ రూల్ ప్రకారం.. బ్యాట్స్‌మన్ బాల్‌ను ఆడిన చోటు నుంచి స్టంప్స్‌కు మధ్య దూరం 3 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని నాటౌట్‌గా ప్రకటిస్తారు. రోహిత్ ఆ బాల్‌ను ఎదుర్కొన్న సమయంలో వికెట్ల నుంచి అతడి ఎడమ కాలికి సరిగ్గా 3.7 మీటర్ల దూరం ఉంది. ఒకవేళ రోహిత్ రివ్యూకు వెళ్లుంటే నాటౌట్‌గా ప్రకటించేవారని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.
Mohammad Kaif questions the decision on Rohit Sharma’s LBW dismissal.
📷: Jio Cinema#RohitSharma #MohammadKaif #MIvsRCB pic.twitter.com/1synj3eb2F
— CricTracker (@Cricketracker) May 9, 2023