Rohit Sharma: ఐపీఎల్లో ఏ జట్టుకు లేనన్ని ట్రోఫీలు ముంబైకి ఉన్నాయి. ఐదుసార్లు ఆ జట్టును కెప్టెన్ రోహిత్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆటగాడిగా రోహిత్‌కి 6 ట్రోఫీలు ఉన్నాయి. కానీ.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఒక చెత్త రికార్డును సైతం రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడపాదపాగా తన కెరీర్ ని నెట్టుకొస్తున్న హిట్ మ్యాన్.. ఐపీఎల్ సీజన్ 16 లో కూడా తన పూర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. చాలా సంవత్సరాలు ముంబై జట్టుకి కెప్టెన్ గా జట్టులో కొనసాగుతున్న రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో.. గొప్ప ఇన్నింగ్స్ ల సంగతి కాస్త పక్కనపెడితే రోహిత్ బ్యాట్ నుంచి కనీస ప్రదర్శన కూడా రావడం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఈ స్టార్ బ్యాటర్ ఖాతాలో ఒక చెత్త రికార్డ్ వచ్చి చేరింది.
రోహిత్ శర్మ ఎంత స్టార్ బ్యాటరో తన రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. సొగసైన ఆటతీరుతో, మంచి టైమింగ్ తో చాలా ప్రశాంతంగా బౌలర్ల మీద ఆధిపత్యం చూపిస్తాడు ఈ ముంబై బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్లో అతను నెలకొల్పిన రికార్డులైతే అనేకం. ఇక ఐపీఎల్లో అయితే దాదాపు 6000 పరుగులు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. ఇంత మంచి టాక్ రికార్డున్న హిట్ మ్యాన్ ఇప్పుడు ఐపీఎల్లో ఒక దారుణమైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఒక్క పరుగు చేయడానికి హిట్ మ్యాన్ ఏకంగా 10 బంతులు వృథా చేసాడు. అయితే రోహిత్ శర్మ ఇంత దారుణమైన స్ట్రైక్ రేట్ కలిగి ఉండడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఐపీఎల్లో ఇలా రెండు సార్లు తొలి పది బంతులు ఎదుర్కున్న రోహిత్ కి కనీసం 30 స్ట్రైక్ రేట్ కూడా లేదు.
బ్యాటర్ గా షేన్ వాట్సాన్ అత్యధికంగా తొలి పరుగు తీసుకోవడానికి 15 బంతులు తీసుకోగా.. కెప్టెన్ గా రోహిత్ కి మాత్రమే ఇంత చెత్త రికార్డ్ ఉంది. వేరే ఏ కెప్టెన్ కూడా తొలి 10 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగే చేసిన సందర్భాలు లేవు. ఇదిలా ఉండగా నిన్న ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్ తో సీజన్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ కి ఎప్పటిలాగే తొలి మ్యాచ్ లో పరాజయ తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(84) మాత్రమే రాణించాడు. అనంతరం ఒక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా చేధించేసింది. ఓపెనర్లు కోహ్లీ(82), కెప్టెన్ డుప్లెసిస్(73) ముంబై బౌలర్లకు ఏ దశలో అవకాశం ఇవ్వలేదు. మరి రోహిత్ పేరిట నమోదైన ఈ చెత్త రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.