సాధారణంగా క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్ ఏది చెబితే ఆ మాటే ఫైనల్. ఈ క్రమంలో అంపైర్ చెప్పిన మాటను గౌరవిస్తూ.. అతని నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు తమ దూకుడిని అంపైర్ మీద చూపిస్తారు. కానీ రోహిత్ శర్మ నిన్న ఏం చేసాడంటే ?
సాధారణంగా క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్ ఏది చెబితే ఆ మాటే ఫైనల్. ఈ క్రమంలో అంపైర్ చెప్పిన మాటను గౌరవిస్తూ.. అతని నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు తమ దూకుడిని అంపైర్ మీద చూపిస్తారు. నాటౌట్ అని చెప్పినా ఎందుకు నాటౌట్? అని కారణమడుగుతుంటారు. ఈ క్రమంలో అంపైర్ తో వాద్వాగానికి దిగుతూ తమ అసహనాన్ని తెలియజేస్తారు. ఇదంతా మనం ఇది వరకు చాలా సార్లు గ్రౌండ్ లో చూసి ఉంటాము. కానీ నిన్న మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ తో వాగ్వాదానికి దిగడమే కాకుండా అది ఖచ్చితంగా ఔట్ అని అంపైర్ కే చెప్పాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరివరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సహనాన్ని కోల్పోయాడు. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 20 ఓవర్లో కెప్టెన్ రోహిత్ అర్షద్ కి బౌలింగ్ ఇచ్చాడు. ఈ ఓవర్లో నాలుగో బంతిని ఫుల్ టాస్ గా వేయగా జైస్వాల్ ఆ బాల్ ని కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే అంపైర్ ఈ బంతిని నో బాల్ అనుకోని థర్డ్ అంపైర్ ని సంప్రదిచాడు. దీంతో ఇది గ్రహించిన రోహిత్ అంపైర్ మీద వాగ్వాదానికి దిగాడు. అది నో బాల్ కాదు ఫుల్ టాస్ అని అంపైర్ కి చెప్పాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో అది అవుట్ గా తేలడంతో రోహిత్ అనవసరంగా కంగారు పడ్డాడు అని అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ ఒక్కడే 124 పరుగులు చేయడం విశేషం. ఇక భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టులో ఓపెనర్లు విఫలమైనా.. సూర్య(55) , గ్రీన్(44) ఆ జట్టుని ఆదుకున్నారు. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ సహకారంతో చివర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 45)అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై మరో మూడు బంతులుండగానే విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఐపీఎల్ లో 1000 వది కావడం విశేషం. మొత్తానికి రోహిత్ శర్మ అంపైర్ తో అర్ధం లేని వాగ్వాదం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.