ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి నాని మూవీకి రోహిత్ చేసిన పనికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి ముంబై ఇండియన్స్ ను విజయం వరించింది. ముంబై విజయానికి లాస్ట్ బాల్ కు రెండు పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ తెలివిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు రోహిత్. ఇక ఈ మ్యాచ్ లో నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి నాని మూవీకి రోహిత్ చేసిన పనికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబుచులాడింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లాస్ట్ బంతికి ముంబై విజయం సాధించి.. ఈ సీజన్ లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో కెప్టెన్ వార్నర్(51) మరోసారి అర్దశతకంతో మెరిశాడు. మిగతావారిలో అక్షర్ పటేల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లతో 54 పరుగులతో దుమ్మురేపాడు. ఇక వరుసగా విఫలం అవుతన్న పృథ్వీ షా(15) మరోసారి నిరాశపరిచాడు. ముంబై బౌలర్లలో బెహ్రండూఫ్, చావ్లాలు చెరో మూడు వికెట్లతో చెలరేగారు.
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి చివరిదాక ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. అతడికి తోడు తిలక్ వర్మ 41 పరుగులతో రాణించాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో హీరో నాని నటించిన జెర్సీ మూవీ రిపీట్ అయింది. రోహిత్ అర్ద శతకం సాధించిన తర్వాత బ్యాట్ ఎత్తకుండా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. సహజంగానే ఏ బ్యాటర్ అయినా శతకం, అర్ధశతకం సాధిస్తే.. అభిమానుల వైపు చూసి బ్యాట్ తో అభివాదం చేస్తారు. కానీ ఈసారి రోహిత్ అలా చేయలేదు. సోషల్ మీడియాలో జెర్సీ మూవీ రిపీట్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
జెర్సీ మూవీలో నాని మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. ఆ మ్యాచ్ లో నాని అర్ధశతకం సాధిస్తాడు. కానీ బ్యాట్ ఎత్తి సెలబ్రేషన్స్ చేసుకోడు. దాంతో నాని కొడుకు వాళ్ల అమ్మతో.. అమ్మ నాన్న ఎందుకు బ్యాట్ ఎత్తలేదు అని అడుగుతాడు. దాంతో వాళ్ల అమ్మ మీ నాన్న సెంచరీ అయ్యాకే బ్యాట్ ఎత్తుతాడు అంటూ సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా ఇదే ఫాలో అయ్యాడు అంటూ నెట్టింట రాసుకొచ్చారు అభిమానులు. అదీకాక రోహిత్ జట్టు విజయం మీదే ఎక్కువగా ఫోకస్ చేశాడు అందుకే ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు అని తెలుస్తోంది.
Rohit Sharma fifty pic.twitter.com/3kc92EHAsn
— @Habibullah_dbg (@imHabib71) April 11, 2023