Rohit Sharma, Tilak Varma: నవ్వు ఆపుకోలేకే.. ‘అబ్ బస్ కర్ యార్’ అంటూ తిలక్ ఫ్లోను అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ గురించి, బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నారు. తిలక్ హైదరాబాద్ స్లాంగ్ బాగుందని రోహిత్ అన్నాడు.
ఐపీఎల్ 2023లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తిలక్.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. తిలక్ చెలరేగడంతో ఈ సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులతో రాణించాడు. మనీష్ పాండే 18 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో అక్షర్ పటేల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 54 పరుగులు చేసి దడదడలాడించాడు. అక్షర్ వేగంగా ఆడటంతో ఢిల్లీ ఫైటింగ్ టార్గెట్‌ను ముంబై ముందు ఉంచగలిగింది.
ఛాలెంజింగ్ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబైకి మంచి స్టార్ట్ లభించింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఆరంభ ఓవర్లలోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులు బాదేశారు. తొలి వికెట్‌కు 71 పరుగులు చేసిన తర్వాత.. ఇషాన్ కిషన్ 31 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరూ మ్యాచ్‌ను ముంబై చేతుల్లో పెట్టేశారు. 29 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేసి రాణించాడు.139 పరుగుల వద్ద ముంబై తిలక్ వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవ్వడం, మరో నాలుగు పరుగుల తర్వాత రోహిత్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రోహిత్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చివర్లో చిన్నపాటి డ్రామ చోటు చేసుకున్నప్పటికీ.. టిమ్ డేవిడ్(13 నాటౌట్), కామెరున్ గ్రీన్(17 నాటౌట్) మ్యాచ్‌ను ముగించారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత మంచి ప్రదర్శన ఇద్దరు ఆటగాళ్లు రోహిత్ శర్మ-తిలక్ వర్మ చిన్న చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. వేగంగా ఆడి 41 పరుగులు చేసిన తిలక్‌ను ఎలా అనుభూతి చెందుతున్నావ్ అని రోహిత్ ప్రశ్నించగా.. ‘రోహిత్ భాయ్ మీతో కలిసి ఆడాలని ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా.. ఇవాళ ఆ కోరిక తీరింది. మీతో కలిసి ఆడటం చాలా సంతోషంగా ఉంది, ఇది చిన్ననాటి కల’ అంటూ.. అదే పనిగా రోహిత్‌ను పొగడ్తలతో ముంచెత్తడంతో రోహత్ నవ్వు ఆపుకోలేకే.. ‘అబ్ బస్ కర్ యార్’ అంటూ తిలక్ ఫ్లోను అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ గురించి, బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నారు. తిలక్ హైదరాబాద్ స్లాంగ్ బాగుందని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
How does @TilakV9 feel to bat with “The Hitman”? 🤔
What does @mipaltan captain @ImRo45 feel about a young & talented Tilak Varma? 🤔
You wouldn’t want to miss this insightful & fun convo 😎 – By @ameyatilak
Full Interview 🎥 🔽 #TATAIPL | #DCvMIhttps://t.co/fkU5RsIEMe pic.twitter.com/wT4OgPnQoR
— IndianPremierLeague (@IPL) April 12, 2023