ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ల కొత్త లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరువురి ఫ్యాన్స్ వీటిని బాగా షేర్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అసలైన మజా ఇప్పుడు రానుంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే దాదాపుగా అన్ని జట్లకు ప్రతి మ్యాచ్ చావోరేవో అనేలా తయారైంది. నెగ్గడమే కాదు మెరుగైన రన్‌రేట్‌తో భారీ విజయాలు సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్స్ రేసులో నిలవగలరు. దీంతో అన్ని టీమ్స్ ఆయా దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్ బెర్త్ మీద కన్నేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు.. ఆరింటిలో విజయం సాధించింది, ఐదు మ్యాచుల్లో ఓడింది. మొత్తంగా 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తదుపరి ఆడే మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. కనీసం రెండింట్లో నెగ్గితే.. మిగతా జట్ల గెలుపోటములు, మెరుగైన రన్‌రేట్‌ను బట్టి ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఆధారపడి ఉంటుంది.
ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ముంబైలో ఒక విషయం ఫుల్ కిక్ ఇస్తుండగా, మరో విషయం ఆందోళన పరుస్తోంది. లీగ్ ఆరంభంలో ఫెయిలైన స్టార్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ కరెక్ట్ టైమ్‌లో భీకర ఫామ్‌లోకి రావడం ముంబై ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. అదే టైమ్‌లో సారథి రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం ఆందోళన రేపుతోంది. ఒకవేళ హిట్‌మ్యాన్ కూడా ఫామ్ అందుకుంటే ముంబైని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ న్యూ లుక్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నెరిసిన జుట్టు, చేతిలో ఊతకర్ర, కళ్లకు జోళ్లు, మెడలో శాలువాతో ఓల్డ్ లుక్‌లో ఉన్న ఈ స్టార్ క్రికెటర్ల ఫొటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఒక యాడ్ షూట్ కోసం రోహిత్-సూర్య ఇలా న్యూ లుక్స్‌లో మారారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Rohit Sharma and Suryakumar Yadav in an Ad shoot. pic.twitter.com/0ZIhdqwva1
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2023