సచిన్ కొడుక్కి ఏ మ్యాచ్ లోనూ సరిగా బౌలింగ్ ఇవ్వట్లేదు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకి ఆ భయం పట్టుకోవడం వల్లే ఇలా చేస్తున్నాడని తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ముంబయి ఇండియన్స్ కి ఈసారి ఎందుకో అస్సలు కలిసి రావట్లేదు. ఇప్పటివరకు ఏడు మ్యాచులాడితే అందులో రెండే గెలిచింది. అవి కూడా హైదరాబాద్, కోల్ కతా లాంటి కాస్త బలహీనంగా ఉన్న జట్లపై. దీంతో ముంబయి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎందుకిలా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు అని తెగ గింజుకుంటున్నారు. ఇదే సమస్య అనుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు మరో భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు సంగతికొస్తే.. దిగ్గజ సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, ముంబయి ఇండియన్స్ లో గత కొన్నేళ్ల నుంచి ఉన్నాడు. కానీ ఆడే ఛాన్సులు రాలేదు. ఈసారి మాత్రం గ్రౌండ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచులు ఆడాడు. కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కేకేఆర్ పై 2 ఓవర్లలో 17 పరుగులు, సన్ రైజర్స్ పై 2.5 ఓవర్లలో 18 రన్స్, పంజాబ్ పై 3 ఓవర్లలో 48 పరుగులు, తాజాగా గుజరాత్ పై 2 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ మీరు సరిగా గమనిస్తే ఓ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఏ మ్యాచ్ లోనూ అర్జున్.. బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. అంటే నాలుగు ఓవర్లు కంప్లీట్ గా వేయలేదు. ఇప్పుడు ఇదే కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది.
సచిన్ కొడుకుగా అర్జున్ చిన్నప్పటి నుంచే టీమిండియా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. తండ్రిలా బ్యాటర్ అవుతాడేమోనని అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ గా అయ్యాడు. ఇన్నాళ్లు పెద్దగా ఆడే ఛాన్స్ రాలేదు. ఈ సీజన్ లో వచ్చింది కానీ అర్జున్ బౌలింగ్ ని ప్రత్యర్థి బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. పంజాబ్ తో మ్యాచ్ లో అయితే ఒకే ఓవర్ లో ఏకంగా 31 రన్స్ బాదేశారు. దీంతో రోహిత్ శర్మకి భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ అర్జున్ కి పూర్తి బౌలింగ్ ఇస్తే.. మళ్లీ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వస్తాయి. బహుశా కెప్టెన్ గా అది రోహిత్ పై ఎఫెక్ట్ చూపించొచ్చు!
అందుకేనేమో గుజరాత్ తో మ్యాచ్ లో ప్రారంభంలోనే అర్జున్ కి రెండు ఓవర్లు ఇచ్చి సైడ్ చేశారు. ఇదే మ్యాచ్ లో ముంబయి బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. ఏ బౌలర్ ని గుజరాత్ బ్యాటర్లు వదిలిపెట్టలేదు. బాదుడే టార్గెట్ గా పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేసినట్లు అనిపిస్తోంది. దీంతో గుజరాత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. సో అదన్నమాట విషయం. ఏదేమైనా అర్జున్ కి పూర్తి బౌలింగ్ ఇస్తేనే కదా అతడి సత్తా ఏంటో తెలిసేది. అలా కాకుండా కావాలనే బౌలింగ్ ఇవ్వకుండా, సచిన్ పేరు పోతుందేమో అని అనుకుంటే ఎలా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి మీకేమైనా ఇలా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి.
Arjun tendulkar made a new record under Rohit Sharma’s Captaincy 🔥🔥🔥🔥🔥
31 runs in a over#MiVsPbks pic.twitter.com/OiXfBAbZr6
— 𝙎𝙋𝙄𝘿𝙀𝙔シ︎ (@Spidey_RCB) April 22, 2023