గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో ప్రారంభం అయిన ఐపీఎల్ 2023కి కూడా దూరం అయ్యాడు పంత్. ప్రమాదం తర్వాత తొలిసారి గ్రౌండ్ లోకి అడగుపెట్టాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు హాజరైయ్యాడు పంత్.
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఇక ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో భయటపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడటంతో.. మెగా టోర్నీలన్నింటికి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రారంభం అయిన ఐపీఎల్ 2023కి కూడా దూరం అయ్యాడు పంత్. ప్రమాదం తర్వాత తొలిసారి గ్రౌండ్ లోకి అడగుపెట్టాడు పంత్. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు హాజరైయ్యాడు పంత్. దాంతో అభిమానులు పంత్ ను చూసి భావోద్వేగానికి గురైయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో గాయపడి.. మెగా టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టేసరికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాల్సిన పంత్.. గాయం కారణంగా ఈ సీజన్ మెుత్తానికే దూరం కావాల్సి వచ్చింది. ఇక మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ కు పంత్ హాజరై.. అభిమానులను సర్ప్రైజ్ చేశాడు.
ఇక పంత్ ను చైర్ పై చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 13వ ప్లేయర్ గా పంత్ కు స్థానం కల్పించింది జట్టు. మోకాలికి సర్జరీ కావడంతో.. కాలుకి కట్టుతోనే కనిపించాడు పంత్. అయితే ఈ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన పంత్ కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ బ్యాటర్లు తక్కువ పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు షమీ, రషీద్ ఖాన్ ల ధాటికి తక్కువ పరుగులకే కట్టడి అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ వార్నర్ (37), సర్ఫారాజ్ ఖాన్ (30), అక్షర్ పటేల్ (36) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు తీశారు.
When he enter the Stadium
Audience Chanting :”We want Rishabh Pant.”
😊😭💜💕#RishabhPant #DCvsGT pic.twitter.com/nF0RYOotbE— Mihika Singh (@Stars_ki_Duniya) April 4, 2023
Fans in the Arun Jaitley Stadium have a special message for Rishabh Pant 💙
📸: Jio Cinema#RishabhPant #DCvsGT #CricTracker pic.twitter.com/GPHjqowh0H
— CricTracker (@Cricketracker) April 4, 2023
Rishabh Pant marks his presence for Delhi Capitals’ first home game at the Arun Jaitley Stadium.
📸: Jio Cinema pic.twitter.com/VPUdbRrD6Z
— CricTracker (@Cricketracker) April 4, 2023